టెన్నిస్సీ తెలుగు సమితి దీపావళి వేడుకలు


అమెరికాలోని టినెస్సీ రాష్ట్రం నాష్విల్లిలో టెనెస్సీ తెలుగు సమితి ఆధ్వర్యంలో దసరా, దీపావళి 2015 సంబరాలను ఘనంగా నిర్వహించారు. వెస్టెండ్‌ మిడిల్‌ స్కూల్‌లో జరిగిన ఈ వేడుకలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. సంఘం కార్యదర్శి ఆత్రేయ సభికులకు స్వాగతం పలుకగా, కృష్ణమయి జ్యోతి వెలిగించి వేడుకలను ప్రారంభించారు. వేదపండితులు పద్మనాభాచార్యులు విఘ్నేశ్వర పూజ నిర్వహించి కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని ప్రార్థించారు. ఇటీవల ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారికి స్నిగ్ధ నారాయణదాస్‌ ఆధ్వర్యంలో సంతాపం తెలియజేస్తూ కొద్ది సేపు మౌనం పాటించారు. అనంతరం సంఘం అధ్యక్షులు రాజేష్‌ నారాయణ దాస్‌ ఈ వేడుకల ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. ఈ సందర్భంగా సహనా బాలసుబ్రమణ్యం చేసిన భరతనాట్యం ప్రేక్షకులను ఆకట్టుకుంది. సంఘం సభ్యుడు శ్రీ శ్యాం ప్రకాశ్‌ జాలెం వేదిక ఏర్పాట్లను పర్యవేక్షించారు. యూత్‌ కమిటీ సభ్యులు శశాంక్‌ కందిపాటి, వర్ష చిగురుపాటి వేడుకల గొప్పతనాన్ని సభికులకు వివరించారు. గాయనీ గాయకులు నరేంద్ర, సుమంగళి, కారుణ్యలను సంఘం సభ్యులు వందన, శ్యామ్‌ ప్రకాశ్‌, వేణు ఆలోకం తదితరులు సభకు పరిచయం చేశారు. వీరు తమ పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఈ సందర్భంగా హేమంత్‌ వీరమాచనేని ఏర్పాటు చేసిన ‘ఐ’ సినిమా సభికులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో హేమంత్‌ వీరమాచనేని, హరి నారాయణదాస్‌, అజయ్‌ చిరుగుపాటి, నరిసింహారావు పత్రి, శ్వేత గంజిపల్లి, ప్రశాంతి చిగురుపాటి, రవి యెల్లయ్య, శ్వేత మేడికొండ, స్వప్న గిరి ప్రగడ, హరి తుంగతార్తి, కల్పన పోచంపల్లి, రజని కాకి, హారిక రంభ, దీప్తి రెడ్డి, బ్రూనో తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రాజేష్‌ అరమండ్ల, జ్యోత్స్న పరుచూరి, సాయిదత్త పీఠం, సౌత్‌ ప్లెయిన్‌ ఫీల్డ్‌, న్యూజెర్సీ కమిటీ మెంబరు, తెలుగు కళా సమితి ట్రస్టీ మధు అన్నా గాయకులకు జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా దసరా, దీపావళి 2015 సంబరాలను ఉద్దేశించి మధు అన్నా చేసిన ప్రసంగం సభికులను ఆటక్టుకుంది. ఆవరణలో ఏర్పాట్లను రవి యెల్లా బృందం ఎంతో చక్కగా అమలు పరిచింది. అల్పాహారం, భోజన ఏర్పాట్లను బాల, శివ పెద్దిరెడ్డి తదితరులు పర్యవేక్షించారు. సంఘం అధ్యక్షులు రాజేష్‌ నారాయణ దాస్‌, శ్యాం ప్రకాశ్‌ తదితరులు కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com