టైటానిక్ మునిగింది మంచు వలన కాదు

టైటానిక్ ఈ పేరు అందరికీ సుపరిచితమే. కారణం జేమ్స్ కామెరూన్ టైటానిక్ విషాదగాథకు ప్రేమ కథను జోడించి తెరకెక్కించిన చిత్రం. టైటానిక్ ను గురించిన ఓ ఆసక్తికర విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. సౌథాంప్టన్ నుంచి న్యూయార్క్ బయల్దేరిన టైటానిక్ మునిగిపోయింది. ఈ హృదయ విదారక సంఘటనలో 1,500 మంది ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోయారు. మంచుకొండను ఢీ కొట్టడం వల్ల ఘటన జరిగిందని మనందరికీ తెలుసు. అయితే, మంచుకొండను ఢీ కొట్టడమే ఈ దుర్ఘటనకు కారణం కాదని పరిశోధకుడు, జర్నలిస్టు సెనాన్ మొలొని చెబుతున్నారు. టైటానిక్ కు సంబంధించిన చిత్రాలను ముప్ఫై ఏళ్లుగా పరిశీలిస్తున్న ఆయన ఓడ అడుగుభాగంలో 30 అడుగులు వెడల్పు ఉన్న నల్లని మచ్చను గుర్తించారు. ఈ మచ్చకు కొద్ది దూరంలోనే మంచుకొండను టైటానిక్ ఢీ కొట్టింది. ఓడను నడపడానికి అడుగుభాగంలో ఇంజన్ ను ఉంచారు. ఇంజన్ కు శక్తినందించేందుకు టన్నుల కొద్దీ బొగ్గును నిరంతరం రగుల్చుతుండటం వల్ల ఆ ప్రాంతంలో వెయ్యి డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత ఉండేదని సెనాన్ చెప్పారు. దీనివల్ల ఓడ అడుగుభాగం బలహీన పడిందని అదే సమయంలో మంచుదిబ్బను ఓడ ఢీ కొట్టడంతో టైటానిక్ కథ విషాదాంతమైందని చెప్పారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com