టోక్యోలో కేటీఆర్ పర్యటన

రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ శనివారం రాత్రి కొరియా పర్యటనను ముగించుకొని జపాన్‌ రాజధాని టోక్యోకు చేరారు. సియోల్‌ విమానాశ్రయంలో భారత రాయబారి దొరైస్వామి, ఇతర అధికారులు ఆయనకు వీడ్కోలు పలికారు. ఈ నెల 19 నుంచి కేటీఆర్‌ కొరియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. శనివారం ఆయన సియోల్‌లో వ్యర్థపదార్థాల శుద్ధి కేంద్రాన్ని సందర్శించారు. అక్కడి నిపుణులు ఈ కేంద్రం నిర్వహణను వివరించారు. కేటీఆర్‌ మాట్లాడుతూ, తెలంగాణలోనూ ఇదే తరహా శుద్ధికేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు.దీనికి దక్షిణ కొరియా నిపుణుల సాయం తీసుకుంటామని చెప్పారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com