ట్యాంక్‌బండ్ మూసేశారు.

ఐకాస ఆధ్వర్యంలో నేడు చేపట్టనున్న మిలియన్‌ మార్చ్‌ స్ఫూర్తి సభ సందర్భంగా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్‌ అధికారులు ట్యాంక్‌బండ్‌పై వాహనాల రాకపోకలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 5 వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు.అనుమతి లేకున్నా సభ నిర్వహణకు పిలుపునిచ్చిన నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వి.వి.శ్రీనివాసరావు తెలిపారు. జెండాలు పట్టుకుని వచ్చినా, ట్యాంక్‌బండ్‌పై సభ నిర్వహించేందుకు యత్నించినా అరెస్ట్‌ చేస్తామన్నారు. మిలియన్‌ మార్చ్‌లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్న నాయకులు, కార్యకర్తలపై పోలీసులు నిఘా ఉంచారు. అదనపు బలగాలను దింపి సీపీఐ ప్రధాన కార్యాలయం మగ్దూం భవన్‌, కోదండరామ్‌ నివాస ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు. మిలియన్‌ మార్చ్‌కు అనుమతించకపోవడం ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి నిదర్శమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీపీఐ న్యూడెమొక్రసీ నాయకుడు గోవర్థన్‌ విమర్శించారు. తెలంగాణ ప్రజాఫ్రంట్‌ అధ్యక్షుడు నలమాస కృష్ణను బంధువుల ఇంట్లో పెళ్లికి వెళుతుంటే అరెస్టు చేశారని తెలంగాణ పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్‌ గడ్డం చెప్పారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com