ట్రంప్ రాజీనామా!

లైంగిక వేధింపుల ఆరోపణలతో ట్రంప్‌ తన పదవికి రాజీనామా చేస్తున్నారన్నట్లుగా ఉన్న ఓ ట్వీట్‌ను పెంటగాన్‌ పొరపాటుగా రీట్వీట్‌ చేసింది. గమనించిన అధికారులు వెంటనే గ్రహించి ఆ ట్వీట్‌ను డిలీట్‌ చేశారు. అప్పటికే ఆ రీట్వీట్‌ కాస్తా నెటిజన్ల కంట పడింది. ఇంకేముంది అది కాస్తా వైరల్‌గా మారింది. పెంటగాన్‌ ఇలా పొరపాటుగా ట్వీట్‌ చేయడం ఇదేమీ మొదటిసారి కాదండోయ్‌. గతంలో కూడా ‘అమెరికా రహస్యంగా ఆయుధాలను దాస్తోంది, బీ-1 అణుబాంబులను గాల్లో వదలనుంది’ అని పెంటగాన్‌ ట్వీట్‌ చేసింది. పొరపాటుగా ట్వీట్‌ చేసిన తర్వాత అటువంటిదేమీ లేదని పెంటగాన్‌ వివరణ ఇచ్చుకోక తప్పలేదు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com