ట్రావెల్స్ బస్సుల్లో వంద కోట్లు నగదు

భారీగా సొమ్ము పట్టబడటం కర్ణాటకలో కలకలం రేపింది. మంగళవారం ఉదయం బెంగళూరు-అనంతపురం రహదారిపై పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో చిక్‌ బల్లాపూర్‌.. తిప్పగానిపల్లి వద్ద వెంకటేశ్వర ట్రావెల్స్‌కు చెందిన ఓ బస్సు నుంచి నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ. 100 కోట్లపైగానే సొమ్ము ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనలో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న కర్ణాటక పోలీసులు.. నగదును ఎక్కడికి, ఎందుకు తరలిస్తున్నారన్న విషయంపై దర్యాప్తు చేపట్టారు. త్వరలో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు పార్టీలు ప్రయత్నిస్తుండగా.. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com