ట్విట్టర్‌లో సాచిపెట్టి కొట్టిన సుష్మా

భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ ట్విటర్‌లో ఎంత చురుగ్గా ఉంటారో తెలిసిన విషయమే. విదేశాల్లో చిక్కుకొని సమస్యలు ఎదుర్కొంటున్న భారతీయులకు ఒక్క ట్వీట్‌ ద్వారా పరిష్కారం చూపిస్తారు. ఈసారి మనీలాలో ఉంటున్న వైద్యవిద్యార్థికి అలాంటి సాయమే చేశారు. జమ్మూకశ్మీర్‌కు చెందిన అతీఖ్‌ ఫిలిఫ్పైన్స్‌లో మెడిసిన్‌ చదువుతున్నాడు. అయితే అతడు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. భారత్ వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలని భావించాడు. కానీ అతడు పాస్‌పోర్టు పాడవడంతో కొత్త దాని కోసం నెల క్రితం దరఖాస్తు చేసుకున్నాడు. ‘ నేను జమ్మూ కశ్మీర్ వాసిని, మనీలాలో వైద్యవిద్యను అభ్యసిస్తున్నాను. నా పాస్‌పోర్టు పాడవడంతో కొత్తదాని కోసం అప్లై చేశాను. నా ఆరోగ్యం సరిగా లేకపోవడంతో వైద్య పరీక్షల కోసం భారత్ రావాలనుకుంటున్నాను . వెంటనే నా పాస్‌పోర్టు అందేలా ఏర్పాటు చేయగలరు. నేను విద్యార్థి కావడంతో వైద్యానికి అయ్యే ఖర్చులు భరించలేను’ అని ట్విటర్‌ ద్వారా విదేశాంగ మంత్రిని అభ్యర్థించాడు. ఎప్పటిలాగే వెంటనే స్పందించిన మంత్రి ‘నువ్వు జమ్మూ కశ్మీర్ విద్యార్థివైతే వెంటనే సాయం చేసేవాళ్లం. కానీ నీ ప్రొఫైల్ ‘భారత్‌ ఆక్రమిత కశ్మీర్’ అని చూపిస్తుంది. అలాంటి పేరున్న ప్రదేశమే లేదు’ అంటూ ఆమె సమాధానం చెప్పారు. ఆ విద్యార్థి ట్విటర్‌ ఖాతా ‘భారత్‌ ఆక్రమిత కశ్మీర్’ అని సెట్ చేసి ఉంది. దాంతో సుష్మా స్వరాజ్‌ ఈ విధంగా సమాధానం ఇచ్చారు. తన తప్పిదాన్నిగుర్తించిన విద్యార్థి వెంటనే జమ్మూకశ్మీర్/మనీలా అంటూ తన ఖాతా వివరాలను సరిచేసుకున్నాడు. ఈ విషయాన్ని గుర్తించిన సుష్మా స్వరాజ్‌ ‘ నీ ప్రొఫైల్ సరిచేసుకున్నందుకు సంతోషం. అతడు జమ్మూకశ్మీర్ విద్యార్థి. వెంటనే అతడికి సహాయం అందించండి’ అంటూ అధికారులకు సూచించారు. ఈ ట్వీట్‌ను నెటిజన్లు 5000 సార్లు షేర్‌ చేయడంతోపాటు పదివేల మంది లైక్‌ చేశారు. ‌

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com