డల్లాస్‌లో తెదేపా సందడి మొదలు

ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో అమెరికాలో తొలిసారిగా డల్లాస్ నగరంలో మహానాడును 27,28 తేదీల్లో ఘనంగా నిర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఇరు తెలుగు రాష్ట్రాల నుండి పెద్దసంఖ్యలో అతిథులు, రాజకీయ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారని నిర్వాహకులు తెలిపారు. మంత్రి గంటా, ఎంపీ సీ.ఎం.రమేష్, శాసనసభ్యులు కదిరి బాబూరావు, అనగారి సత్యప్రసాద్, తెతెదేపా కార్యదర్శి పెద్దిరెడ్డి, గాయకులు కౌసల్య, సింహా, శ్రీలక్ష్మీ, సందీప్ తదితరులు వేడుకలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారందరికీ ఉచిత భోజన సదుపాయం కల్పిస్తున్నారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారులకు వినోద వేడుకలు కూడా నిర్వహిస్తున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com