డల్లాస్‌లో నాట్స్ తదుపరి సమావేశాలు-TNI ప్రత్యేకం

నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) 2019 జూన్, జూలై నెలలో వార్షిక మహాసభలు నిర్వహించడానికి సన్నద్దమవుతోంది. తొలుత ఈ మహాసభలను సీయాటెల్ లో జరపాలని భావించారు. ఐతే అక్కడ మహాసభలు నిర్వహించడానికి పరిస్థితులు సహకరించలేదు. అనంతరం టాంపాలో నిర్వహించాలని భావించారు. అక్కడ తగిన వసతులు లేవని కార్యవర్గం భావించినట్లు సమాచారం. డల్లాస్ నగరంలో ఈ మహాసభలు నిర్వహించాలని ఇటీవల జరిగిన కార్యవర్గ సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది. 2013లో డల్లాస్ నగరంలో నాట్స్ మహాసభలు నిర్వహించారు. మళ్ళీ డల్లాస్ లోనే మహాసభను జరపబోతున్నారు. ఇంకా తేదీలను, వేదికను ఖరారు చేయలేదు. వచ్చే జులై మొదటి వారంలో అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీలో తానా మహాసభలు నిర్వహిస్తున్నారు. తానా జరిగే తేదీల్లో కాకుండా విడిగా నాట్స్ సమావేశాలు జరిగే అవకాశం ఉంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com