డల్లాస్ మహానాడుకు మంత్రి గంటా హాజరు

అమెరికాలోని డల్లాస్ నగరంలో వచ్చే 27, 28తారీఖులలో నిర్వహిస్తున్న భారీ స్థాయి ‘మహానాడు’ కు పలువురు ప్రముఖ తెలుగుదేశం నాయకులు హాజరవుతున్నట్లు అమెరికాలో ఆంధ్ర రాష్ట్ర ప్రత్యెక ప్రతినిధి కోమటి జయరాం తెలిపారు. ప్రస్తుతం విజయవాడలో ఉన్న జయరాం మంగళవారం నాడు TNIతో మాట్లాడారు. అమెరికాలోని దాదాపు అన్ని రాష్ట్రాల నుండి తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు డల్లాస్ లో జరిగే మహానాడుకు హాజరవుతున్నట్లు తెలిపారు. 26వ తేదీ సాయంత్రం నుండి తానా అద్యక్షుడు వేమన సతీష్, డల్లాస్ లో ఉన్న ఎన్నారై తెదేపా నాయకుల ఆద్వర్యంలో మహానాడు వేదిక తదితర ఏర్పాట్లు ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ మహానాడు కు మంత్రి గంటా శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యుడు సి.ఎం రమేష్, టీటీడీ పాలకవర్గ సభ్యుడు ఈ.పెద్దిరెడ్డి ఎమ్మెల్యే బాబురావులు హాజరవుతున్నారని మిగిలిన మరికొందరి పేర్లు త్వరలో ఖరారు అవుతాయని తెలిపారు. మే 31న డల్లాస్ పర్యటనకు వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వస్తున్నట్లు తెలిసిందని ఆయన పర్యటన మరో రెండు రోజులు ముందుకు జరపమని మహానాడుకు హాజరుకమ్మని కోరామని తెలిపారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com