డాక్టరుగారికి తొందరెక్కువ

మన దేశంలో ఓ రోగిని చూసేందుకు వైద్యులు సగటున రెండంటే రెండే నిమిషాలు వెచ్చిస్తున్నారని తాజా అధ్యయనంలో తేలింది. బంగ్లాదేశ్‌లో అయితే ఈ సమయం 48 సెకన్లుగా ఉన్నట్లు బయటపడింది. స్వీడన్‌లో అత్యధికంగా ఇది 22.5 నిమిషాలున్నట్లు తేలింది. బ్రిటిష్‌ మెడికల్‌ జర్నల్‌ నిపుణులు ఈ అధ్యయనం చేపట్టారు. 67 దేశాల్లో 2.85 కోట్ల మంది వైద్యులు పాల్గొన్న 178 అధ్యయన ఫలితాలను వారు విశ్లేషించారు. అనంతర విశ్లేషణలో విస్మయం చెందే విషయాలు వెలుగుచూశాయి. దీనిలోని వివరాల ప్రకారం..
* ప్రాథమిక ఆరోగ్యానికి డిమాండ్‌ పెరుగుతున్న కొద్దీ.. వైద్యులు వెచ్చించే సమయంపై ఒత్తిడి ఎక్కువవుతోంది.
* వైద్యులు పరీక్షించే సమయం తగ్గుతున్న ప్రాంతాల్లో అనారోగ్య ముప్పులు పెరుగుతున్నాయి.
* ప్రపంచంలో సగం జనాభాకు నిలయమైన 15 దేశాల్లో వైద్యులు సగటున ఒక్కోరోగిపై ఐదు నిమిషాల కంటే తక్కువ సమయమే కేటాయిస్తున్నారు. తర్వాతి 25 దేశాల్లో ఇది 10 నిమిషాలుగా ఉంది.
* అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ సమయం ఏటా పెరుగుతూ వస్తోంది. అమెరికాలో ఇది 20 నిమిషాలుగా ఉంది. గతేడాది కంటే ప్రస్తుతం 12 సెకన్లు పెరిగాయి. బ్రిటన్‌లో ఇది 10 నిమిషాలుగా ఉంది. గతేడాదితో పోలిస్తే.. నాలుగు సెకన్ల పెరుగుదల కనిపించింది.
* అయితే మధ్య ఆదాయ దేశాల్లో ఈ సమయం తగ్గుతూ వస్తోంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com