డిజిటల్ భారత్ లక్ష్యానికి మోడీ పథకాలు సాయపడుతున్నాయి

పెద్దనోట్లను రద్దుచేస్తూ ప్రధానిమంత్రి నరేంద్ర మోదీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని ఏడాది పూర్తిచేసుకున్న సందర్భంగా ఓవర్‌సీస్‌ ఫ్రెండ్స్‌ ఆఫ్‌ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అమెరికాలోని న్యూజెర్సీలో నవంబర్‌ 8న నల్లధన వ్యతిరేక దినోత్సవం, చాయ్‌పే చర్చ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓఎఫ్‌ బీజేపీ జాతీయ అధ్యక్షులు కృష్ణారెడ్డి అన్నగుల మాట్లాడుతూ… పెద్దనోట్ల రద్దుతో దేశాన్ని సుదీర్ఘకాలం పట్టి పీడిస్తున్న నల్లధనం, అవినీతి, ఉగ్రవాదం చీడపురుగులకు గట్టి ఎదురుదెబ్బ తగిలిందన్నారు. డిజిటల్‌ పేమెంట్స్‌ పెరిగి దేశంలో విప్లవాత్మక ప్రయోజనాలు కలిగాయన్నారు. ఓఎఫ్‌ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు అడపా ప్రసాద్‌ మాట్లాడుతూ… అవినీతి, ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదం, నల్లధనం, నకిలీనోట్లపై నోట్ల రద్దు నిర్ణయం సర్జికల్‌ స్ట్రైక్స్‌ వంటిదన్నారు.ఓఎఫ్‌ బీజేపీ కార్యదర్శి వాసుదేవ్‌ పటేల్‌ మాట్లాడుతూ.. పన్నుచెల్లించే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. దేశంలో దీర్ఘకాలం పెండింగ్‌లో ఉన్న భారతీయ ఆర్థిక వ్యవస్థను శుభ్రపరచడంలో నోట్ల రద్దు సహాయపడిందని అన్నారు. ఓఎఫ్‌ బీజేపీ కార్యవర్గ సభ్యులు కల్పనా శుక్లా, జాతీయ యువ సహా-కన్వీనర్‌ విలాస్‌ రెడ్డి జంబుల, ఓఎఫ్‌ బీజీపీ న్యూ జెర్సీ కోఆర్డినేటర్‌ అరవింద్‌ పటేల్‌, ఓఎఫ్‌ బీజీపీ న్యూజెర్సీ కో-కోఆర్డినేటర్‌ ఆనంద్‌ జైన్‌, ఓఎఫ్‌ బీజీపీ మీడియా కో-కన్వీనర్‌ దిగంబర్‌ ఇస్లాంపురే, వంశీ యంజాల, అల్పేష్‌ పటేల్‌, ప్రణవ్‌ పటేల్‌ పాల్గొన్నారు. న్యూ జెర్సీతో పాటు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో నల్లధన వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com