డిప్రెషన్-వాటి అపోహలు.

ప్రతి దశాబ్దానికి దానికి చెందిన మంచి సంఘటనలు, కష్టసమయాలు ఉంటాయి. అలాగే ఈ దశాబ్దపు ప్రముఖ సామాజిక ఇబ్బంది మానసిక ఆరోగ్యం గురించి బయటకి మాట్లాడటం, పంచుకోవటం. నిజానికి, ప్రపంచ ఆరోగ్యసంస్థ గణాంకాల ప్రకారం దాదాపు 350 మిలియన్ల మంది ప్రపంచవ్యాప్తంగా డిప్రెషన్ తో బాధపడుతున్నారు. అయితే మరే ఇతర సామాజిక రుగ్మతలలాగానే, మానసిక అనారోగ్యాన్ని కూడా దాచిపెట్టి, అణచిపెట్టడంలో ఇప్పటిదాకా విజయాలే ఉన్నాయి. మానసిక వ్యాధులకి సంబంధించి అనేక అపోహలు, మూఢనమ్మకాలు ఇంకా ఉన్నాయి. అందుకని, ఇక్కడ డిప్రెషన్ కి సంబంధించిన 10 ప్రముఖ ఆశ్చర్యకరమైన మూఢనమ్మకాలు, వాటిని ఎలా ఎదుర్కోవాలో చర్చించటం జరిగింది.

అపోహ #1 డిప్రెషన్ నిజమైన వ్యాధి కానేకాదు
ఎంతమంది ఇంకా డిప్రెషన్ అంటే కేవలం తీవ్రమైన బాధకి రూపమే మరియు మరికొంత ఆశావాదంతో ఉంటే మామూలు అయిపోతారని అనుకుంటారో తెలిస్తే హతాశులవుతారు. నిజానికి ఇలాంటివారు, డిప్రెషన్ తో బాధపడుతున్నవారు కావాలనే తీవ్రమైన బాధని కోరుకుని అందులోనే ఉండటానికి ఇష్టపడతారని ఆరోపిస్తారు కూడా. నిజమేమిటంటే ; డిప్రెషన్ అనేది చాలా ముఖ్యమైన మానసిక అనారోగ్యం. దీని లక్షణాలు తర్కంలేని భావాలు, అంటే ప్రపంచంలో మరియు దాని బారిన పడిన వ్యక్తి ఇక ఏదీ సరిగా జరగదని, మంచిగా మారదని భావించడం. నిజానికి,డిప్రెస్ అయిన వ్యక్తులు ఈ నెగటివ్ వలయంలో చాలా లోతుగా కూరుకుపోయి, తినడం, మంచం మీదనుంచి కదలటం, నెలలకి నెలలు, సంవత్సరాల పాటు పరిశుభ్రత ఇలాంటివన్నీ వదిలేయటం చేస్తుంటారు.

అపోహ #2 యాంటీ డిప్రెసెంట్ మందులతో డిప్రెషన్ కు చికిత్స చేసేయవచ్చు
ఒకప్పుడు కేవలం యాంటీ డిప్రెసెంట్లు మాత్రమే డిప్రెషన్ కు చికిత్స చేయటానికి ఉండేవి. కానీ పెరిగిన పరిశోధనల్లో తేలినది ఏమిటంటే యాంటీ డిప్రెసెంట్ మందులు గాయంపై బ్యాండ్ ఎయిడ్ లా మాత్రమే ఉపయోగపడతాయని. ఎందుకు ? ఎందుకంటే ఈ మందులు మీ మానసిక స్థితిపై ప్రభావం చూపి, మీకు మత్తును కలిగిస్తాయి. తద్వారా రోజంతా అంగవైకల్యం వచ్చినవారిలా వళ్ళు మీ స్వాధీనంలో ఉండదు. నిజమేమిటంటే ; డిప్రెషన్ కి సరైన చికిత్స ఇప్పటికీ లేదు. దానితో బాధపడుతున్నవారు దానిలోంచి బయటపడ్డాక కూడా జీవితకాలంలో ఒకసారికన్నా ఎక్కువ మళ్ళీ దాని బారిన పడుతున్నారు. కానీ, సైన్స్ వేగంగా అభివృద్ధి చెందుతుండటం వలన, ప్రస్తుతం డిప్రెషన్ కు చికిత్స చేయటానికి మనకి చాలా రకాల చికిత్సా విధానాలు ఉన్నాయి. అవి కాగ్నటివ్ బిహేవియరల్ థెరపీ మరియు సెరోటోనిన్ ఎక్కువ ఉండే డైట్ వంటివి. యాంటీ డిప్రెసెంట్లను వాడటం ఆ చికిత్సా విధానాలలో ఒక పద్ధతి మాత్రమే, అది కూడా ఆత్మహత్యల ఆలోచనలు తరచూ వచ్చేవారికి మాత్రమే వాడతారు.

అపోహ #3 మీరు కావాలంటే డిప్రెషన్ నుంచి ‘చిటికెలో’ బయటకి వచ్చేయవచ్చు
అపోహ #1 లో వివరించినట్టు చాలా మంది డిప్రెషన్ ను బాధపడటం అనే అనుకుని కావాలంటే బాధపడుతున్న వ్యక్తి చిటికెలో బయటకి వచ్చేయవచ్చని భావిస్తారు. దురదృష్టవశాత్తూ, డిప్రెషన్ మాములు మనకి వచ్చే బాధలాగా నిర్దిష్టంగా ఉండదు. నిజమేమిటంటే ;డిప్రెషన్ తో బాధపడే చాలామందికి ఇతర మానసిక లేదా వ్యక్తిత్వ లోపాలు కూడా ఉంటాయి, అనగా ఉదాహరణకి బైపోలార్ డిజార్డర్ లేదా బోర్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ వంటివి. ఇలాంటి వాటినుంచి మీరు కావాలనుకున్నా చిటికెలో బయటకి రాలేరు. దీనికి వైద్యసాయం ఒకటే మార్గం.

అపోహ #4 ; మీ జీవితంలో ఏదైనా మనసు బెదురుతో చెదిరిపోయే సంఘటన జరిగితేనే మీకు డిప్రెషన్ వస్తుంది
మీ జీవితంలో ఏదైనా చెడు జరిగితే డిప్రెషన్ వచ్చే అవకాశాలు, రిస్క్ ఎక్కువగానే ఉన్నా, అంటే తల్లి లేదా తండ్రి చనిపోతేనో మీ పెంపుడు జంతువు లేదా మీకిష్టమైన పక్కింటివారు ఇలా మిమ్మల్ని వదిలిపోతే మీరు తట్టుకోలేకపోయినా, అన్ని సమయాల్లో ఈ కారణం వల్లనే డిప్రెషన్ రావచ్చని చెప్పలేం. నిజమేమిటంటే ; మనలో చాలామందికి హఠాత్తుగా డిప్రెషన్ రావచ్చు. నిజానికి, ప్రపంచంలో ఇక తమకి తిరుగులేదనే పిచ్చితో ఊగిపోయే సంఘటన జరిగిన వెంటనే బైపోలార్ వ్యక్తుల్లో వేగంగా డిప్రెషన్ వస్తుందని చాలామందికి తెలిసిన విషయమే!

అపోహ #5 పురుషుల కన్నా మహిళల్లో డిప్రెషన్ ఎక్కువ
ఈ సామాజిక అపోహ పురుషులు సాధారణంగా తమకి సాయం కావాలని అడగటానికి అహంగా భావిస్తారు కాబట్టి అక్కడినుంచి వచ్చింది. ఇక సమస్యను ఎదుర్కోవటం తప్పనిసరి అయ్యేవరకూ వారు ఒప్పుకోరు. నిజమేమిటంటే ; పురుషులు, స్త్రీలు ఇద్దరూ ఒకేలా డిప్రెషన్ కి గురవుతారు. కాకపోతే స్త్రీలు సాయం కావాలని కన్నీళ్ళ రూపంలో ఎక్కువగా తెలియచేస్తారు. ఇది ఒక దురదృష్టకరమైన నిజం మరియు ఈ నెగటివ్ అపోహను తొలగించాలంటే ఒకటే మార్గం మీ కొడుకులకి వారి భావాలను బయటకి పంచుకోవటం అవసరమని పదేపదే శిక్షణ ఇవ్వటం మాత్రమే.ఇంకా అవసరమైనప్పుడు సాయం అడగటం వారి మగతనపు లోపాలు కాదు పైగా ఆత్మవిశ్వాసానికి సూచనలు అని అర్థమయ్యేటట్లు చెప్పండి.

అపోహ #6 ఆత్మహత్య చేసుకునే వారందరూ డిప్రెషన్ కి లోనైనవారే
ఇది నిజం కాదు. ఆత్మహత్య చేసుకునేవారందరూ డిప్రెషన్ కి గురయినవారు కాదు. కాకపోతే జీవితాలలో తీవ్రబాధలలో ఉన్నవారే అయివుంటారు, స్టాకు మార్కెట్ పడిపోవటం, మద్యబానిసత్వం, ప్రేమలో విఫలమవ్వటం వంటివి. నిజమేమిటంటే ; కేవలం తీవ్ర డిప్రెషన్ మాత్రమే మనుషులలో ఆత్మహత్య ఆలోచనలు కలిగిస్తుంది. ఆత్మహత్యలు చేసుకునే చాలామంది అది సులభంగా చేయటం కన్పిస్తేనే చేసుకుంటారు ఎందుకంటే సాధారణంగా డిప్రెషన్ లో ఉన్నవారు ఎంతగా అలసిపోయి ఉంటారంటే మంచం కూడా దిగి వెళ్ళలేరు. అదేకాక మీరు డిప్రెషన్ లో ఉండి, ఆత్మహత్య ఆలోచనలు వస్తూ ఉంటే, వేగంగా సైక్రియాట్రిస్ట్ సాయం తీసుకోండి. మీరు మీ ప్రాణం తీసుకోడానికి కూడా చాలా అలసటతో ఓపికలేక వదిలేస్తారన్నామని, ఆ మాట మీద జీవితాన్ని పణంగా పెట్టడం సరికాదు.

అపోహ#7 పేద దేశాలకి చెందినవారు ఎక్కువ డిప్రెషన్లో ఉంటారు
నిజం కాదు! ఎందుకు? ఎందుకంటే గణాంకాల ప్రకారం, ధనికదేశాలకి చెందినవారికే పేదదేశాల ప్రజలకన్నా ఎక్కువ డిప్రెషన్ వస్తూ ఉంది. నిజానికి యునైటడ్ స్టేట్’స్, రష్యా, ఫ్రాన్స్ మరియు జపాన్ లలో ప్రపంచవ్యాప్తంగా కన్నా ఎక్కువ డిప్రెషన్ రేటులు నమోదయ్యాయి. నిజమేమిటంటే ; అభివృద్ధి చెందుతున్న దేశాలలో చాలామంది డిప్రెషన్ బారిన పడరు, ఎందుకంటే వారి సామాజిక వ్యవస్థ వారిని ఒకరితో మరొకరిని దగ్గరిగా బంధాలలో కలిపి ఉంచుతుంది. దీనివల్ల ఒంటరితనం మరియు తర్కం లేని ఆలోచనాతీరు రాకుండా డిప్రెషన్ అసలు మొదలవదు.

అపోహ #8 డిప్రెషన్ కి గురైన వ్యక్తులు మానసికంగా బలహీనులు
తప్పు! చారిత్రకంగా మాట్లాడితే, అద్భుతమైన మేధావులందరూ ఎప్పుడో అప్పుడు డిప్రెస్ అయ్యేవారే, ఎందుకంటే వారు ప్రపంచంలో చేదు వాస్తవాలకి సాధారణంగా దూరంగా ఉంటారు. నిజానికి, అబ్రహం లింకన్, సిల్వియా ప్లాథ్ మరియు ఫ్రాన్స్ కాఫ్కా వీళ్ళందరూ జీవితం మొత్తం డిప్రెషన్ తో యుద్ధం చేసారనటానికి ప్రముఖ ఉదాహరణలు. ఆధునిక కాలంలో కూడా లిల్లీ సింగ్, దీపికా పదుకునే వంటి వారు అనేకమంది ఉదాహరణలుగా ఉన్నారు. నిజమేమిటంటే ; తెలివైన వారు ఎక్కువగా మానసిక రుగ్మతల బారిన పడతారు, డిప్రెషన్ కూడా అందులో ఒకటి. వెంటనే సాయం తీసుకోవాలనే ధైర్యం చూపినవారు తప్పక మళ్ళీ మామూలైపోతారు.

అపోహ #9 దాని గురించి మాట్లాడటం మరింత ముదిరేలా చేస్తుంది
ఇది కూడా మానసిక సమస్యల గురించి బయటకి మాట్లాడకపోవటం, సిగ్గు అనే తీవ్ర సామాజిక రుగ్మత నుంచి వచ్చింది ( అక్కడికి ఏదో మెదడు మన శరీరంలో భాగం కానట్టు!) కానీ నిజానికి ఎవరైతే తమ డిప్రెషన్ గురించి మనసు విప్పి మాట్లాడతారో వారు మౌనంగా తమలో తాము బాధపడేవారికన్నా ఎక్కువగా కోలుకుంటారు. నిజమేమిటంటే ; డిప్రెషన్ కి గురైన వారికి, ఇతర వ్యాధులు వచ్చినవారి లాగానే వారి కుటుంబసభ్యుల నుంచి, దగ్గరి వారినుంచి చాలా ఆదరణ, సంరక్షణ అవసరమవుతుంది. అలా అయితేనే వారు తమ వ్యాధి లక్షణాలు దాచకుండా ,ఇంకా తీవ్రంగా చెప్పాలంటే ఆత్మహత్య చేసుకోకుండా ఉంటారు. దీని గురించి మాట్లాడటం చాలా ఉపయోగపడుతుంది, ఎందుకంటే వినేవ్యక్తి డిప్రెస్ అయిన వ్యక్తి తర్కం లేని ఆలోచనలను, ప్యాట్రన్స్ ను గుర్తించగలుగుతాడు మరియు మెల్లగా ఆ నెగటివ్ వలయం నుంచి బయటపడటానికి సాయపడగలడు.

అపోహ#10 మీ తల్లిదండ్రులకు ఉంటే, మీక్కూడా తప్పదు
ఇటీవల అధ్యయనాల ప్రకారం తల్లిదండులలో డిప్రెషన్ ఉంటే పిల్లల్లో పెద్దవారయ్యాక ఎప్పుడో 10-15 శాతం డిప్రెషన్ వచ్చే అవకాశం ఉందని తేలినా, చాలా కేసుల్లో, అది జన్యుఆధారితంగా, వారసత్వంగా వచ్చే డిప్రెషన్ గా పరిస్థితులని బట్టి అనుకుంటారు కానీ నిజంగా అదే కారణం కాకపోవచ్చు. నిజమేమిటంటే ; మీరు డిప్రెషన్ గురౌతారా లేదా అన్నది మీ చుట్టూ పరిసరాల ప్రభావం వల్ల ఎక్కువగా జరుగుతుంది. అందుకే ఎవరైతే వారి కుటుంబం, స్నేహితులతో లోతైన బంధాలు కలిగివుంటారో, అవసరమైనప్పుడల్లా వారి ప్రేమను, అండను పొందుతారో అలాంటివారికి డిప్రెషన్ రాదు. అలా లేని వారికి, మనసు పంచుకోలేని వారు సాధారణంగా డిప్రెషన్ బారిన పడతారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com