డివిలియర్స్ మెచ్చిన మొనగాడు-వీరేంద్ర సెహ్వాగ్

మిస్టర్‌ 360, సూపర్‌మ్యాన్‌ ఏబీ డివిలియర్స్‌కు అభిమాన క్రికెటర్‌ ఎవరో తెలుసా అని అడిగితే… ఇంకెవరు కింగ్‌ కోహ్లీ అని బదులిస్తాం. కానీ, ఇది నిజం కాదు. ఇంతకీ డివిలియర్స్‌ ఇష్టమైన క్రికెటర్‌ ఎవరో తెలుసా.. భారత క్రికెట్‌ జట్టు మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌. ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌లో పాల్గొన్న డివిలియర్స్‌ ఓ టాక్‌ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. డివిలియర్స్‌తో పాటు జాంటీ రోడ్స్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ క్రమంలో డివిలియర్స్‌ను భారత క్రికెటర్లలో మీ అభిమాన క్రికెటర్‌ ఎవరని అడగ్గా.. అందరూ విరాట్‌ కోహ్లీ పేరు చెబుతాడని ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ, ఏబీ.. వీరేంద్ర సెహ్వాగ్‌ అని బదులిచ్చాడు. అనంతరం జాంటీ రోడ్స్‌ని అడగ్గా సురేశ్‌ రైనా అని చెప్పాడు. డివిలియర్స్‌ తాజాగా ఓ వీడియో సందేశం ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. ‘గత 14 ఏళ్లుగా క్రికెట్‌ ఆడి బాగా అలసిపోయాను. వేరే వాళ్లకు అవకాశం ఇవ్వాలి. ఇది కఠిన నిర్ణయమే. ఆడితే పూర్తిగా ఆడాలి. ఏదో ఒక ఫార్మాట్‌ను ఎంచుకుని ఆడటం నాకిష్టం లేదు. దేశవాళీ క్రికెట్‌కి మాత్రం అందుబాటులో ఉంటాను’ అని డివిలియర్స్‌ తెలిపిన సంగతి తెలిసిందే.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com