ఢిల్లీలో దొంగల అందరి పేర్లు…షారుఖ్ ఖాన్

షారుక్‌ ఖాన్‌..ఈ పేరు వినగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది బాలీవుడ్‌ సూపర్‌స్టారే. ఇదే పేరు ఓ సామాన్య వ్యక్తికి ఉంటే అతన్ని నలుగురిలో ప్రత్యేకంగా చూస్తుంటారు. అయితే దేశ రాజధాని దిల్లీలో మాత్రం అరెస్టైన స్మగ్లర్లు, ఉగ్రవాదులు, దొంగలు తమ పేర్లు మార్చుకుని ‘షారుక్‌ ఖాన్‌’ పేరుతో చలామణి అవుతున్నారట. ఈ విషయాన్ని దిల్లీ పోలీసులు మీడియా ద్వారా వెల్లడించారు. ఇప్పటివరకూ పోలీసులు అరెస్ట్‌ చేసిన వారిలో నిషేధిత ముజాహిదీన్‌‌ సంస్థ వ్యవస్థాపక సభ్యుడు యాసిన్‌ భత్కల్‌ ఉన్నాడు. ఇతను గతంలో తన పేరును షారుక్‌ ఖాన్‌గా మార్చుకుని చలామణి అయ్యాడు. ఈ సంస్థకు చెందిన ఇక్బాల్‌, రియాజ్ అనే మరో ఇద్దరు ఉగ్రవాదులు మోస్ట్‌ వాంటెడ్‌ లిస్ట్‌లో ఉన్నారు. వీరిద్దరు కూడా తమ పేర్లను షారుక్‌ఖాన్‌గా మార్చుకుని తప్పించుకు తిరుగుతున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com