ఢిల్లీలో సత్యనారాయణ స్వామి వ్రతం

దేశ రాజధానిలోని శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో సత్యనారాయణ స్వామి కల్యాణోత్సవం నిర్వహించనున్నట్లు ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాశ్‌ తెలిపారు. ఈ నెల 9, 10 తేదీల్లో స్థానిక గోల్‌ మార్కెÆట్‌లోని శ్రీవారి ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతం, కల్యాణోత్సవం నిర్వహించనున్నట్లు బుధవారం ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. అన్నవరం దేవస్థానం ప్రధాన అర్చకులచే సత్యనారాయణస్వామి వ్రతం ఈ నెల 9న ఉదయం 9 నుంచి 11 గంటల వరకు, 10న సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు కల్యాణం నిర్వహించనున్నట్లు ప్రవీణ్‌ ప్రకాశ్‌ వివరించారు. దిల్లీ వాసులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. వ్రతంలో పాల్గొనదలచిన భక్తులు ఎం.వి. రంగయ్య (9818506647), శ్రీరాములు (8588862170), సురేశ్‌ (9811179696), నాగేశ్వరరావు (9893847742)లను సంప్రదించాలని కోరారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com