తన్నులు తింటున్న తారక్

తన ముద్దుల కుమారుడు అభయ్‌రామ్‌ అల్లరి చేసినప్పుడు మందలిస్తే.. తిరిగి గట్టిగా కొడుతున్నాడని హీరో ఎన్టీఆర్‌ అన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఆయన నటించిన తాజా చిత్రం ‘జనతా గ్యారేజ్‌’. సెప్టెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకురానున్న సందర్భంగా చిత్ర ప్రచారంలో భాగంగా ఎన్టీఆర్‌ విలేకరులతో ముచ్చటించారు.
* ‘రభస’ సమయంలోనే ఈ కథ విన్నా, బాగా నచ్చింది. బిజీగా ఉండటం వల్ల చేయలేకపోయాను. ‘నాన్నకు ప్రేమతో..’ తర్వాత మొదలైంది. ఈ సినిమాలో ‘జనతా గ్యారేజ్‌’ అనేది చాలా ముఖ్యం.
* మలయాళ నటుడు మోహన్‌లాల్‌తో కలిసి నటించడం ఆనందంగా ఉంది. ఆయన ఓ సంపూర్ణమైన వ్యక్తి. ఇందులో నేను ఆనంద్‌ అనే పాత్రలో ప్రకృతి ప్రేమికుడిగా కనిపిస్తాను.
* ‘ఇచట అన్నీ రిపేర్లు చేయబడును’ అంటే వాహనాలతో పాటు మనుషులను కూడా రిపేర్‌ చేస్తారని అర్థం.
* సమంత, నిత్యా మేనన్‌లు చాలా చక్కగా నటించారు. హీరోయిన్లకు ఇలాంటి పాత్రలు దొరకడం అరుదు.
* దర్శకుడు కొరటాల శివ తక్కువ సమయంలోనే చిత్రాన్ని బాగా తీశారు. ఇది యాక్షన్‌ చిత్రం కాదు, కుటుంబ కథా చిత్రం.
* ‘జనతా గ్యారేజ్‌’ టైటిల్‌ ముందు నుంచీ అనుకున్నదే. ఈ కథకు ఇంతకన్నా మంచి టైటిల్‌ దొరకదు.
* సినిమా విడుదల దగ్గర పడుతున్న కొద్దీ కొంచెం టెన్షన్‌గా ఉంది. ప్రేక్షకుల అభిప్రాయం తెలుసుకునేంత వరకు ఈ టెన్షన్‌ ఉంటుంది. జయాపజయాలను పట్టించుకోను అని అనను. వాటినీ పరిగణలోకి తీసుకుంటాను.
ఈ సందర్భంగా తనయుడు అభయ్‌రామ్‌ గురించి కూడా ఎన్టీఆర్‌ మాట్లాడారు. ‘బాబు బాగా అల్లరి. మట్టిలో ఆడుకుంటున్నాడు. వాడి కోసం వీలైనంత ఎక్కువ సమయం కేటాయిస్తున్నా. అల్లరి చేసినప్పుడు మందలిస్తే.. తిరిగి గట్టిగా కొడుతున్నాడు. తండ్రి అన్న అనుభూతి బాగుంటుందని అందరూ అంటుంటే నాకు తెలియలేదు. అది ఇప్పుడు అర్థమైంది. తర్వాతి సినిమా ఏం అనుకోలేదు. కొంత బ్రేక్‌ తీసుకుని అప్పుడు ఆలోచిస్తాను’ అని ఎన్టీఆర్‌ అన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com