తప్పుడు సందేశాలను సరిదిద్దుకునే అవకాశం

ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న వాట్సాప్‌ ‘డిలీట్‌’ ఫీచర్‌ ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఇకపై ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌, విండోస్‌ ఫోన్లలో వాట్సాప్‌ వాడుతున్న వినియోగదారులందరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. ఇప్పటి వరకు ఎవరికైనా పొరపాటు సందేశం పంపితే దాన్ని డిలీట్‌ చేసే అవకాశం ఉండేది కాదు. దీంతో ఒక్కోసారి భారీ మూల్యాన్నే చెల్లించాల్సి వచ్చేది. ఇకపై వినియోగదారులకు అలాంటి అవసరం లేకుండా వాట్సాప్‌ ఈ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మీ స్నేహితులకో లేదా గ్రూప్‌లోనో పొరపాటున ఓ సందేశాన్ని పంపారనుకుందాం. ఏదైతే మీరు పంపారో ఆ సందేశాన్ని ముందుగా సెలెక్ట్‌ చేసుకోవాలి. ఆ తర్వాత పైన ఉండే ‘డిలీట్‌’ సింబల్‌ను క్లిక్‌ చేయాలి. ‘డిలీట్‌ ఫర్‌ ఆల్‌’ను సెలెక్ట్‌ చేసుకోవడం ద్వారా సందేశాన్ని డిలీట్‌ చేయొచ్చు. కేవలం మీకు మాత్రమే సందేశం డిలీట్‌ కావాలంటే ‘డిలీట్‌ ఫర్‌ మీ’ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. అయితే, కేవలం 7 నిమిషాల వ్యవధి వరకు మాత్రమే ఈ సదుపాయం వినియోగించే వెసులుబాటు ఉంది. అప్పటికే ఆ సందేశాన్ని ఆ వ్యక్తి చూసినా డిలీట్‌ అవుతుంది. మీరు డిలీట్‌ చేసిన తర్వాత అవతలి వ్యక్తికి సందేశం డిలీట్‌ చేసినట్లుగా చూపుతుంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com