తప్పును సరిదిద్దుకునే సమయం పెంచారు

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో గత కొద్ది రోజుల కిందట డిలీట్ ఫర్ ఎవ్రీవన్ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన విషయం విదితమే.

కాగా ఈ ఫీచర్ వల్ల యూజర్లు తాము వాట్సాప్‌లో ఇతరులకు పంపిన మెసేజ్‌లను 7 నిమిషాల్లోగా డిలీట్ చేసుకునే వీలు కల్పించారు.

దీంతో ఎవరైనా పొరపాటుగా ఇంకొకరికి మెసేజ్ పంపితే ఈ ఫీచర్‌ను ఉపయోగించుకుని అలాంటి మెసేజ్‌లను వెంటనే డిలీట్ చేసేందుకు వీలుంటుంది.

అయితే ఈ ఫీచర్‌లో ఇప్పుడు వాట్సాప్ మెసేజ్ డిలీట్ చేసుకునేందుకు వ్యవధిని మరింతగా పెంచింది.

దీంతో 7 నిమిషాలకు బదులుగా ఇప్పుడు మెసేజ్ డిలీట్ చేసేందుకు యూజర్లకు 4096 సెకండ్ల టైం లభిస్తున్నది.

అంటే 68 నిమిషాల 16 సెకండ్ల వరకు ఇప్పుడు మెసేజ్ డిలీట్ చేసేందుకు వాట్సాప్‌లో టైం లభిస్తుందన్నమాట.

అయితే పెంచిన ఈ టైం ప్రస్తుతానికి ఆండ్రాయిడ్‌లో వాట్సాప్ బీటా వెర్షన్‌ను వాడుతున్న యూజర్లకు మాత్రమే లభిస్తున్నది.

త్వరలో పూర్తి స్తాయిలో ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లందరికీ పెంచిన టైం లిమిట్ లభిస్తుంది

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com