తయారీ వైపు భారత రక్షణ రంగం

రక్షణ రంగంలో తయారీ శక్తిగా భారత్‌ ఎదుగుతోందని రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ఇతర దేశాల నుంచి సంబంధిత ఉత్పత్తులను దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఎగుమతి చేసే స్థాయికి చేరుకుందన్నారు. చెన్నై శివారులోని తిరువిడందైలో బుధవారం ‘సైనిక ప్రదర్శన’ ఏర్పాటైన ఈ సందర్భంగా సీతారామన్‌ మాట్లాడారు. గురువారం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. ‘మేక్‌ ఇన్‌ ఇండియా’లో భాగంగా రక్షణ ఉత్పత్తి, తయారీలో తదుపరి కేంద్రంగా మన దేశం నిలవనుందని ప్రపంచానికి చాటిచెప్పడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. మొత్తం 47 దేశాలు పాలుపంచుకోనున్నాయన్నారు. ప్రదర్శనలోని స్టాళ్లను గురు, శుక్రవారాల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5గంటల వరకు వాణిజ్య, వ్యాపార సందర్శకులకు అనుమతిస్తారు. చివరిరోజు సాధారణ ప్రజలకు ప్రభుత్వ గుర్తింపు కార్డులతో ఉచితంగా ప్రవేశం ఉంటుంది. ‘సమస్యకు పరిష్కారం’ పేరిట జాతీయ స్థాయిలో జరిగే పోటీలో ఎనిమిది మంది విజేతలను ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా రక్షణ ప్రదర్శన బ్రోచర్‌ను త్రివిధ దళాల అధికారులతో కలిసి నిర్మలా సీతారామన్‌ ఆవిష్కరించారు. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో కావేరి నిర్వహణ మండలి ఏర్పాటు కోసం ఆందోళనలు జరుగుతుండటంతో ప్రధాని పర్యటనపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com