తలైవతో తీరని కోరిక

పదహారేళ్లుగా చిత్రసీమలో రాణిస్తున్నది చెన్నై సోయగం త్రిష. అగ్ర హీరోలతో జోడీ కట్టి ఎన్నో కమర్షియల్ విజయాల్ని తన ఖాతాలో వేసుకుంది. ఒకప్పుడు దక్షిణాదిన టాప్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. సినీ ప్రయాణంలో చిరస్మరణీయమైన విజయాల్ని అందుకున్న ఈ సుందరికి ఓ తీరని కోరిక ఉందట. దక్షిణాదిన దాదాపు అందరు అగ్ర కథానాయకులతో కలిసి నటించిన ఆమె ఇప్పటివరకు సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసన ఒక్క సినిమా చేయలేదు. ఈ విషయంలోనే తాను అంసంతృప్తిగా ఉన్నట్లు సన్నిహితుల వద్ద బాధపడిందట త్రిష. రజనీకాంత్‌తో కలిసి ఒక్క సినిమాలో నటిస్తే చాలు తన కెరీర్ పరిపూర్ణమైనట్లేనని ఆమె భావిస్తున్నదట.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com