తల్లిగా మీనా

బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా శ్రీవాసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సాక్ష్యం’. ఈ చిత్రంలో సీనియర్ నటి మీనా నటిస్తున్న విషయం ఇప్పటికే ప్రచారంలో ఉంది. తాజాగా నటి మీనా పాత్ర గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ చిత్రంలో హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌కి మదర్‌గా మీనా నటించనుందనేది ఈ వార్తలోని కథనం. బెల్లంకొండ శ్రీనివాస్ గత చిత్రం ‘జయ జానకి నాయక’లో సీనియర్ నటి వాణీ విశ్వనాధ్ నటించిన విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రంలో మీనా నటించనుండటంతో.. ఈ హీరోకి ఇదో సెంటిమెంట్ అవుతుందా.. అనే కామెంట్లు కూడా సోషల్ మీడియాలో దర్శనమిస్తుండటం విశేషం. మీనా కూడా ఈ మధ్య టాలీవుడ్ చిత్రాలలో నటించడానికి ఇంట్రస్ట్ చూపిస్తోంది. ఇటీవల వచ్చిన ‘మామ మంచు అల్లుడు కంచు’ చిత్రంలో ఆమె నటించిన విషయం తెలిసిందే.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com