తల్లి పాలకు బొప్పాయి

బొప్పాయి దీనిని మదుకర్కటి అని అంటారు. ఆంగ్లములో పప్పాయ అని కూడా అంటారు. ఇది ఆముదము ఆకులను పోలిన ఆకులు కలిగి పొడవుగా పెరుగుతుంది. దీని కాండము పెళుసుగా వుంటుంది. దీని కాయలు పచ్చగా వుంటాయి. దీనిపై కాటు పెట్టినా, గిల్లినా దీని నుండి పాలు వెలుబడుతాయి. ఇది చాలా ఉపయోగము. కాయలు పండిన తర్వాత పసుపు రంగులో గాని నారింజ రంగులోకి గాని మారుతుంది.
ఉపయోగాలు.
*దీనిలో అధికంగా ఫైబర్ (పీచు పదార్థము) వుంటుంది. విటమిన్ సి, ఆంటిఆక్సిడెంట్స్ కూడా వుంటాయి. ఇవి కొలాస్ట్రాల్ను తగ్గించుటకు , గుండెపోటు రాకుండా ఉపయోగపడుతుంది.
*ఈ బొప్పాయి క్రమం తప్పకుండా తినటం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.
*బొప్పాయిని మధు మేహముతో బాధపడే వారు కూడా తినవచ్చును. దీనిలో చక్కెర శాతం తక్కువగా వుంటుంది.
*దీనిలో అధికంగా విటమిన్ ఎ, మంచి ఫ్లేవనాయిడ్స్ వుండటం వల్ల కంటిని ఆరోగ్యంగా వుంచడానికి సహకరిస్తుంది.
*బొప్పాయి క్రమం తప్పకుండా తీసుకుంటే మోకాళ్ళ నొప్పులు బారిన పడుకుండా వుంటుంది.
* స్త్రీలలో నెలసరి క్రమపద్ధతిగా వచ్చేట్లు చేయుటకు ఈ బొప్పాయి ఉపయోగపడుతుంది.
*జీర్ణ క్రియ బొప్పాయి వల్ల పెంచుతుంది.
*ఈ పండులో అధికంగా విటమిన్ సి, ఇ, ఎ, ఆంటిఆక్సిడెట్స్, బీటాకెరోటిన్ వుండటం వల్ల చర్మం నిగ నిగలాడుతూ వయస్సును తెలియనీయదు.
*బొప్పాయి క్యాన్సర్ రాకుండా కూడా కాపాడగలదు.
*దీని పచ్చికాయను కోసి కూడా తినడవం వల్ల స్త్రీలకు పాలు అధికంగా వస్తాయి.
*బొప్పాయి పాలను క్షారసూత్ర తయారులో ఉపయోగిస్తారు.
*నేడు అధికంగా డెంగ్యూ వ్యాధితో బాధపడే వారికి బొప్పాయి ఒక వరం లాంటింది.
*బొప్పాయి ఆకు రసాన్ని తీసుకోవటం వల్ల ప్లేట్లెట్స్ పెరుగుతాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com