తహతహ

బాలీవుడ్ కుర్రకారును ఓ రేంజ్ లో ఆకట్టుకుంటూ హీరోయిన్‌గా దూసుకుపోతున్న అలియా భట్… గ్లామర్‌తో పాటు పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ కూడా చేయాలని తహతహలాడుతోంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ అందాల భామ… త్వరలోనే షాన్ దార్ మూవీతో ఆడియెన్స్‌కు బికినీ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. కెరీర్‌లో మంచి జోష్ మీదున్న ఈ అందాల చిన్నది… అప్పుడే తన యాక్టింగ్ స్కిల్స్‌ను ప్రేక్షకులకు ప్రెజెంట్ చేయాలని తెగ ఆరాటపడుతున్నట్టు కనిపిస్తోంది. పాకిస్థానీ పాప్ సింగర్ నజీయా హసన్ బయోపిక్‌లో నటించాలని ఉందని మనసులోని మాటను బయటపెట్టిన అలియా… ఈ స్టోరీతో తనను ఎవరైనా అప్రోచయితే… వెంటనే డేట్స్ ఇస్తానని ఆఫర్ కూడా చేస్తోందట అసలు నజీయా హసన్ బయోపిక్ పై అలియాకు ఎందుకంత ఆసక్తి అనే దానిపై బాలీవుడ్ లో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పదిహేనేళ్ల క్రితం చనిపోయిన ఈ పాకిస్థానీ లేడీ పాప్ సింగర్… 35 ఏళ్ల వయసులోనే క్యాన్సర్ కారణంగా కన్నుమూసింది. నజీయా గురించి పలు విషయాలు తెలుసుకున్న కొందరు అలియా స్నేహితులు… ఆమె బయోపిక్ నీకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని సలహా ఇచ్చారట. అంతేకాదు… నజీయా లాగే నువ్వు కూడా మంచి సింగర్ కాబట్టి… ఈ బయోపిక్ తో నీకు ఊహించనంత పాపులారిటీ వస్తుందని చెప్పారట. ఇక అప్పటి నుంచి ఈ పాక్ పాప్ సింగర్ బయోపిక్ గురించి ఆలోచించడం మొదలుపెట్టిన అలియా బేబీ… తనకు బాగా క్లోజ్ గా ఉండే కొందరు దర్శకులకు ఈ విషయం చెప్పిందట. ఇప్పటికిప్పుడు ఈ బయోపిక్ తెరకెక్కించడం సాధ్యంకాదని చాలామంది దర్శకులు ఆమెకు సూచించారని సమాచారం. అయితే.. ఎప్పటికైనా ఈ బయోపిక్ లో నటించి తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకోవాలని అందాల చిన్నది పట్టుదలగా ఉన్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా… బయోపిక్ లో నటించి తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటే… అలియా ఇమేజ్ మరింత పెరుగుతుందనడంలో సందేహం లేదు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com