తానా-ఫౌండేషన్ చైర్మన్‌ డా.నల్లూరికి ముళ్లపూడి బాపిరాజు అభినందన

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఫౌండేషన్ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన ప్రవాసాంధ్ర ప్రముఖులు, వైద్యులు డా.నల్లూరి ప్రసాద్‌కు పశ్చిమ గోదావరి జడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, టీ.నర్సాపురం జడ్పీ సభ్యుడు నల్లూరి చలపతిరావులు మంగళవారం నాడు హ్యూస్టన్‌లోని డా.నల్లూరి నివాసంలో ఆయన్ను కలిసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తానా, తానా-ఫౌండేషన్‌లను తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించే సేవా కార్యక్రమాల్లో ఏ విధంగా బలోపేతమైన భాగస్వామిగా చేయాలనే దానిపై వీరు చర్చించారు. దీనితో పాటు ఏపీలోని అన్ని జిల్లల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో సీపీఆర్(Cardio-Pulmonary Resuscitation) పద్ధతిపై శిక్షణా తరగతులను నిర్వహించాలని డా.నల్లూరి బాపిరాజును కోరారు. ఈ మేరకు అవసరమైన సహకరాన్ని తానా ఫౌండేషన్ తరఫున అందజేస్తామని ఆయన తెలిపారు. దీనికి సానుకూలంగా స్పందించిన బాపిరాజు, ఏపీ ప్రభుత్వంతో తాను సమన్వయపరుస్తానని, గుండెపోటు వంటి ఆపత్కర పరిస్థితుల్లో సీపీఆర్ పద్ధతి ప్రాణాలను కాపాడుతుందని ఆయన తెలిపారు. అమెరికాలో ప్రతి ఏటా మూడున్నర లక్షల మంది గుండేపోటుకు గురవుతుంటారు. అటువంటి పరిస్థితుల్లో తక్షణమే సీపీఆర్ చేస్తే వారిని బతికించుకునె అవకాశాలు రెండు నుండి మూడు రెట్లు అధికంగా ఉంటాయి. దీనితో పాటు 90శాతం వరకు అటువంటి పరిస్థితుల్లో మృత్యువును జయించేందుకు సీపీఆర్ ఉపయోగపడుతుందని డా.నల్లూరి ప్రసాద్ పేర్కొన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com