తారక్ యాక్సిడెంట్..హంబక్కు

సోషల్ మీడియాతో పాటు కొన్ని వెబ్‌ సైట్స్‌ చూపిస్తున్న అత్యుత్సాహం సినీ సెలబ్రిటీలకు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. కొందరు ఆకతాయిలు కావాలని క్రియేట్‌ చేస్తున్న రూమర్స్‌ కూడా సెలబ్రిటీలకు తలనొప్పిగా మారుతున్నాయి. తాజాగా యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌ కూడా ఈ రూమర్స్ బారిన పడ్డాడు. రాజమౌళి సినిమా కోసం అమెరికా వెళ్లిన జూనియర్‌కు అక్కడ ప్రమాదం జరిగినట్టుగా రెండు రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.తాజాగా ఈ విషయంపై ఎన్టీఆర్ పీఆర్‌, నిర్మాత మహేష్‌ కోనేరు స్పందించారు. ఓ అభిమాని ఎన్టీఆర్ కు ప్రమాదం జరిగినట్టుగా ఓ వెబ్‌సైట్‌ ఉన్న వార్తపై క్లారిటీ కోరగా.. అవన్నీ రూమర్స్‌, ఎన్టీఆర్‌ బాగున్నారు.. షూటింగ్ కోసం రెడీ అవుతున్నారు అంటూ స్పందించారు. త్వరలో త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్న ఎన్టీఆర్‌. ఆ తరువాత రాజమౌళి దర్శకత్వంలో రాంచరణ్ తో కలిసి మల్టీ స్టారర్‌ సినిమాలో నటించనున్నాడు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com