తిక్కల త్రిష

నాకా హక్కు ఉంది అంటోంది చెన్నై చిన్నది నటి త్రిష. సంచలనాలకు కేంద్రబిందువుగా పేరొందిన నటీమణుల్లో ముందుండే ఈ బ్యూటీ సమీపకాలంలో కాస్త సైలెంట్‌ అయ్యిందనుకుంటున్న సమయంలో అలా ఉండడం నా వల్లకాదు అన్నట్లుగా మళ్లీ వివాదాల్లోకి వచ్చేసింది. విక్రమ్, త్రిష నటించిన సామి చిత్రం అప్పట్లో సంచలన విజయాన్ని సాధించింది. హరి దర్శకత్వం వహించిన ఆ చిత్రానికి తాజాగా సీక్వెల్‌ తెరకెక్కుతోంది. ఇందులో విక్రమ్‌కు జంటగా నటి త్రిష, కీర్తీసురేశ్‌లను నాయికలుగా ఎంపిక చేశారు. ఇంతకు ముందు విక్రమ్‌తో ఇరుముగన్‌ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన శిబు తమీన్‌ ఈ సామి–2ను రూపొందిస్తున్నారు. చిత్రం షూటింగ్‌కు రెడీ అవుతున్న సమయంలో అనూహ్యంగా త్రిష మీతో నాకు సెట్‌ కాలేదంటూ వైదొలిగింది. దీంతో షాక్‌కు గురైన చిత్ర నిర్మాత, నిర్మాతల మండలిలో త్రిషపై ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో వివరణ కోరుతూ నిర్మాతల మండలి త్రిషకు నోటీసులు జారీ చేసింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com