తితిదే ఆర్జిత సేవా టికెట్లు విడుదల

2018 అక్టోబర్‌ నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఆన్‌లైన్‌లో తితిదే విడుదల చేసింది. మొత్తం 53,642 సేవా టికెట్లను విడుదల చేసింది. ఎలక్ట్రానిక్‌ లాటరీ విధానం కింద 9,742 సేవా టికెట్లను కేటాయించింది. సుప్రభాతం కింద 7,597, తోమాల కింద 90, అర్చన కింద 90 టికెట్లను విడుదల చేశారు. అష్టాదళ పాదపద్మారాధనకు 240, నిజపాద దర్శనానికి 1725, కరెంటు బుకింగ్‌కు 43,900 ఆర్జిత సేవా టోకెన్లు కేటాయించారు. వసంతోత్సవానికి 11 వేల టికెట్లు, సహస్త్ర దీపాలంకరణకు 12 వేల టికెట్లు అందుబాటులో ఉన్నాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com