తితిదే పక్షపాతం. విజయ బ్యాంకు వీడ్కోలు.

తిరుమల, తిరుపతి దేవస్థానం తరఫున సుదీర్ఘకాలం నుంచి భక్తులకు ఉచిత సేవలందిస్తున్న విజయా బ్యాంకు ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటోంది. దేవస్థానం డిపాజిట్ల విషయంలో పక్షపాతంతో వ్యవహరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంకు వర్గాలు పేర్కొంటున్నాయి. ఎక్కువ వడ్డీ రేటు చెల్లించడానికి ముందుకు వచ్చినప్పటికీ అవకాశం ఇవ్వకుండా ఇందులో వివక్ష ప్రదర్శించినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. దేశంలో 84 ఈ-దర్శన్‌ కేంద్రాలతో పాటు తిరుమలలోని ఇతర కేంద్రాల నిర్వహణ నుంచి వైదొలుగుతున్నట్లు విజయాబ్యాంకు స్పష్టం చేసింది. దీంతో ఈ-దర్శన్‌ కేంద్రాల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. వీటిని తితిదేనే సొంతంగా నిర్వహించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా చేస్తే నెలవారీగా రూ.20 లక్షల భారం పడనుంది. లేనిపక్షంలో ఈ-దర్శన్‌ కేంద్రాలు మూసివేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ విషయంలో తితిదే ఇప్పటి వరకు ఏ నిర్ణయం తీసుకోలేదు. డిపాజిట్ల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వానికి తితిదేపై ఫిర్యాదులు కూడా వెళ్లాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com