తిరస్కారమే పైకి తీసుకొచ్చింది

‘‘చాలామంది సినిమా నేపథ్యం వున్న కుటుంబాల నుండి వచ్చిన తారలకు ఆడిషన్స్ అవసరం లేదనుకుంటారు. కానీ నా విషయంలో అలా జరగలేదు. ఎన్నో ఆడిషన్‌లకు వెళ్లాను. ఎంతోమంది నన్ను తిరస్కరించారు. ఆ బాధ నాకు తెలుసు. నా జీవితంలో ఏదీ సులభంగా జరగలేదు’’ అంటూ బాధను వ్యక్తం చేస్తోంది బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్. మంచి కుటుంబం నుండి వచ్చినా సినిమా అవకాశాలు తనకు రావటానికి చాలా సమయం పట్టింది అని చెబుతోంది ఈ అమ్మడు. తాను నటించిన మొదటి రెండు చిత్రాలు ఎలాంటి గుర్తింపు తీసుకురాలేదు. అయినా బాధలేదు అంటోంది. అయితే ‘ఆషికి-2’ చిత్రం తరువాత లభించిన గుర్తింపు ఆనందాన్నిచ్చింది అని చెబుతోంది. మొదటి నుండీ సినిమాల్లోకి రావాలన్న ఆశ వుండేది. ముఖ్యంగా షూటింగ్ నుంచి ఇంటికి వచ్చేసిన తండ్రి శక్తికపూర్‌ను చూడగానే ఆ కోరిక మరింత పెరిగేది. అయితే ఇప్పుడు ఆ కోరికను నెరవేర్చుకున్నాను అంటూ ఆనందం వ్యక్తంచేసింది. ఈ మధ్య శ్రద్ధాకపూర్ నటించిన హాసీనా పార్కర్ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఎప్పటికప్పుడు కొత్త పాత్రలనే కోరుకుంటాను. అవి ప్రేక్షకాదరణ పొందకపోయినా ఫర్వాలేదు అంటూ తన వ్యూ చెప్పుకొచ్చింది శ్రద్ధాకపూర్.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com