తిరుచానూరు అమ్మవారి వసంతోత్సవాలు

తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు ఈనెల 28 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఈనెల 27న ఉత్సవాలకు శుభసూచకంగా అంకురార్పణ జరగనుంది. మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 4.30 వరకు ఉద్యానంలో అమ్మవారికి స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. అనంతరం రాత్రి అమ్మవారు తిరువీధుల్లో ఊరేగనున్నారు. 29న ఉదయం అమ్మవారికి బంగారు రథోత్సవం జరగనుంది. వసంతోత్సవంలో పాల్గొనే భక్తులు రూ.150 చెల్లిస్తే ఒకరోజు ఉత్సవంలో పాల్గొనే అవకాశం కల్పించనున్నారు. ఉత్సవాల సమయంలో ఆలయంలో జరిగే అన్ని ఆర్జిత సేవలను తితిదే రద్దు చేసింది.
**24న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం
తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి వార్షిక వసంతోత్సవాలను పురస్కరించుకుని ఈనెల 24న ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఉదయం 6 గంటల నుంచి 8.30 గంటల వరకు ఆలయంలోని గర్భాలయం గోడలను సుగంధ పరిమళ ద్రవ్యాలతో శుభ్రం చేయనున్నారు. ఉదయం 9 గంటల తర్వాత భక్తులను దర్శనానికి అనుమతించనున్నట్లు తితిదే తెలిపింది. ఆ రోజున ఆలయంలో జరిగే ఆర్జిత సేవలను రద్దు చేయనున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com