తిరుమలలో విపరీతమైన రద్దీ

తిరుమలలో వేసవి రద్దీ కోనసాగుతోంది. గంటల సమయం క్యూలైన్లలో వేచి ఉన్నప్పటికి స్వామివారి దర్శనం కలగని పరిస్థితి నెలకొంది. సర్వదర్శనానికి 36 గంటలకు పైగా సమయం పడుతోంది. కాలినడకన కొండకు చేరుకునే యాత్రికులకు 20 వేల దివ్యదర్శనం టోకెన్లను జారీ చేస్తున్నారు. నిర్దేశిత సర్వదర్శనం టోకెన్లను 30వేలకు పరిమితం చేశారు. 20 వేల రూ.300ల ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెన్లను జారీ చేశారు. వీరందరికీ నిర్దేశించిన సమయంలో వైకుంఠం వద్దకు చేరుకునే పక్షంలో 3 నుంచి 4 గంటలో స్వామివారి దర్శనం కలుగుతోంది. రద్దీకి తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు జేఈవో శ్రీనివాసరాజు తెలిపారు. జూన్‌ 10వ తారీఖు వరకు రద్దీ కొనసాగే అవకాశం ఉంటుందని అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com