తుళ్ళూరులో క్యాన్సర్ ఆసుపత్రి నిర్మిస్తాం

తెలుగు ప్రజలందరికీ బసవతారకం ఇండో అమెరికన్ ఆస్పత్రి తరపున ఆస్పత్రి ఛైర్మన్, సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 69వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో ఆయన జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జాతీయ జెండా ముందు ప్రజలంతా సమానమే అని… చిన్నా పెద్దా తేడా లేదన్నారు. ఉన్నది నలుగురికి పంచాలన్న ఉద్దేశంతోనే క్యాన్సర్ వ్యాధిగ్రస్థులకి సహాయం చేసేందుకు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి , రీసెర్చ్ సెంటర్‌ని ప్రారంభించామన్నారు. వచ్చే నెలలో ఆంధ్రప్రదేశ్‌లోని తుళ్లూరు ప్రాంతంలోనూ బసవతారకం ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతున్నట్టు బాలకృష్ణ ప్రకటించారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం 15ఎకరాల భూమిని కేటాయించిందన్న ఆయన…. తమకు ఎంతగానో సహకరిస్తున్న ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలిపారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com