తూ.గో.లో జగన్ పర్యటన

ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్ప పాదయాత్ర మంగళవారం తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. పశ్చిమ గోదావరి జిల్లాలో పాదయాత్రను పూర్తి చేసుకున్న జననేత వైఎస్‌ జగన్‌ కొవ్వూరు నుంచి బయలుదేరి రాజమండ్రి రోడ్‌ కం రైల్వే బ్రిడ్జికి చేరుకుని జిల్లాలోకి ప్రవేశించగానే వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. జననేత తమ జిల్లాలోకి వస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు, అభిమానులు, మద్దతుదారులు వేలాదిగా తరలి రావడంతో రోడ్‌ కం రైల్వే బ్రిడ్జి జనసంద్రమైంది. పార్టీ నేతలు, కార్యకర్తలు, అశేష జనవాహిని తోడురాగా వైఎస్‌ జగన్‌ అడుగులు వేశారు. తమ అభిమాన నేత వైఎస్‌ జగన్‌ను చూసేందుకు వేలాదిగా అభిమానులు తరలిరావడంతో రోడ్‌ కం రైల్వే బ్రిడ్జి వద్ద పండగ వాతావరణం కనిపించింది. మరోవైపు వైఎస్‌ జగన్‌ పాదయాత్రలకు తరలివస్తున్న అభిమానులను ఏవో సాకులు చెబుతూ పోలీసులు అడ్డుకోవడం గమనార్హం. బ్రిడ్జి నుంచి పాదయాత్ర కొనసాగించిన వైఎస్‌ జగన్‌ శ్యామల థియేటర్‌ సెంటర్‌కు చేరుకున్నారు. మరోవైపు రోడ్‌ కం రైల్వే బ్రిడ్జిని వైఎస్సార్‌సీపీ జెండాలు, ఫ్లెక్సీలు, కటౌట్లతో సుందరంగా అలంకరించారు. బ్రిడ్జి కింద గోదావరిలో ఒక వైపున పార్టీ జెండాలతో అలంకరించిన 600 పడవలు స్వాగతం పలికాయి. బ్రిడ్జికి మరోవైపున రెయిలింగ్‌కు ఏడు అడుగుల ఎత్తు, 3.5 కిలోమీటర్ల మేర భారీ పార్టీ జెండా కట్టి స్వాగతం పలికారు. జెండాలోని మూడు రంగుల చీరలతో 150 మంది మహిళలు 150 గుమ్మడికాయలతో హారతి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం రాజమహేంద్రవరం వద్ద బ్రిడ్జి ప్రారంభంలో కోటిపల్లి బస్టాండ్‌ ప్రాంతంలో మూడంచెల వేదిక ఏర్పాటు చేస్తున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com