తెతెదేపాను తెరాసలో కలిపేద్దాం

తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్‌ వర్థంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద గురువారం ఆయన నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ తెలుగుదేశం పార్టీని తెరాసలో విలీనం చేస్తే బాగుంటుందని అన్నారు. ‘చంద్రబాబు ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్దకు వచ్చి నివాళులర్పిస్తే బాగుండేది. తెలంగాణలో తెదేపా ప్రాభవం కోల్పోతోందని అందరూ అంటున్నారు. అలాంటి మాటలు వింటుంటే బాధనిపిస్తోంది. పార్టీని భుజాన వేసుకుని నడుపుదామన్నా.. సహకరించేవారు కరువయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో కార్యకర్తలు, ఓటర్ల మనోభావాలను గౌరవించాల్సిన అవసరం ఉంది. తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెదేపా నుంచి వెళ్లిన వారే. అక్కడున్న మంత్రులందరూ తెదేపా వారే. ఈ పరిస్థితుల్లో తెదేపాను తెరాసలో విలీనం చేయగలిగితే బాగుంటుందని నా అభిప్రాయం. అది గౌరవంగానూ ఉంటుంది. పార్టీ అంతరించిపోయిందన్న అవమానం కంటే ఒక మిత్రుడికి సాయం చేయడమే గౌరవంగా ఉంటుంది. ఒకవేళ విలీనం చేసే ఉద్దేశం లేకపోతే చంద్రబాబే తెలంగాణ ప్రాంతమంగా తిరిగి ఇతర పార్టీలకు దీటుగా నడపాల్సి ఉంటుంది’ అని మోత్కుపల్లి నర్సింహులు వ్యాఖ్యానించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com