తెతెదేపా నూతన కార్యాలయం

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌లో తెలుగుదేశం తెలంగాణ రాష్ట్ర నూతన కార్యాలయాన్ని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. తొలుత పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత నేత ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అంతకు ముందు జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మతల్లి ఆలయంలో పూజలు నిర్వహించి, అక్కడి నుంచి ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌ వరకు సైకిల్‌పై ప్రదర్శనగా వచ్చారు. పార్టీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గతంలో తెరాసలో చేరి తిరిగి తెదేపాలోకి వచ్చిన ప్రదీప్‌, పలువురు కార్యకర్తలకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌ రమణ, రేవంత్‌రెడ్డిలు పార్టీ కండువా కప్పి తెదేపాలోకి ఆహ్వనించారు. అధికారం కోసం కాకుండా సిద్దాంతాల కోసం తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని అధ్యక్షుడు ఎల్‌ రమణ అన్నారు. తెరాస ఏ వర్గాల సంక్షేమాన్ని పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. బీసీ, మహిళ, యువత, రైతు, దళిత, వర్గాలకు తెదేపాయే సరైన వేదికని పార్టీ కార్యానిర్వహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. తెరాస ఇచ్చిన హామీల్లో 99శాతం నెరవేర్చలేదన్నారు. చంద్రబాబు నాయకత్వంలో తెలంగాణలో తెలుగుదేశానికి పునర్‌ వైభవం వస్తుందని తెలిపారు. దారి తప్పి తెరాసలోకి వెళ్లిన వారంతా తిరిగి రావాలని కోరారు. తెరాసలోకి వెళ్లిన వారంతా ఆ పార్టీలో ఇమడలేకపోతున్నారని తెదేపాలో చేరిన ప్రదీప్‌ అన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com