తెదేపాకు స్వస్తి పలకనున్న మోత్కుపల్లి?

తమ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడిపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం వెనక తెలుగుదేశం పార్టీ తెలంగాణ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులుకు పక్కా ప్లాన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరేందుకు మార్గం సుగమం చేసుకున్నట్లు తెలుస్తోంది. మోత్కుపల్లి నర్సింహులుకు చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏవీ నెరవేరలేదు. ఇక ముందు నెరవేరుతాయనే ఆశ కూడా లేదు. గవర్నర్ పదవి వచ్చేలా చూస్తానని చంద్రబాబు అప్పట్లో మోత్కుపల్లికి హామీ ఇచ్చారు. అయితే, బిజెపి కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు సూచనను పక్కనపెట్టినట్లు చెబుతున్నారు. గవర్నర్ పదవి వచ్చే అవకాశం లేకపోవడంతో కనీసం రాజ్యసభకైనా పంపాలని మోత్కుపల్లి అడిగినట్లు చెబుతున్నారు. అది నెరవేర్చాలంటే మోత్కుపల్లిని ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపాల్సి ఉంటుంది. దాంతో మోత్కుపల్లి రెండో అభ్యర్థనను కూడా చంద్రబాబు పక్కన పెట్టేశారు. దాంతో చంద్రబాబుపై మోత్కుపల్లి అసంతృప్తితో అన్నారు. తెలుగుదేశం పార్టీతోనే మోత్కుపల్లి నర్సింహులు రాజకీయ జీవితం ప్రారంభమైంది. ఎన్టీ రామారావు ఆయనకు టిడిపి టికెట్ ఇవ్వడంతో ఆలేరు నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి గెలిచారు. అప్పటి నుంి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా కూడా పనిచేశారు. మూడున్నర దశాబ్దాల పాటు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం టిడిపికి తెలంగాణలో భవిష్యత్తు లేదనే పరిస్థితి రావడంతో ఆయన పార్టీ మారాలనే ఆలోచనకు వచ్చినట్లు చెబుతున్నారు. టిడిపిలో తన ప్రత్యర్థి అయిన రేవంత్ రెడ్డి కాంగ్రెసు పార్టీలో చేరడంతో మోత్కుపల్లి నర్సింహులు తెరాసలో చేరాలనే నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. ఈ విషయంపై ఆయన యాదాద్రి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని ముఖ్య నాయకులతో చర్చలు జరిపినట్లు సమాచారం.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com