తెదేపాలో రేగుతున్న రాజ్యసభ రగడ. తెరపైకి హరికృష్ణ.TNI–ప్రత్యేకం

తెలుగుదేశం పార్టీలో ఒక్కసారిగా కలకలం. వచ్చే నెలలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఓ అనూహ్య పేరు తెరపైకి రావటంతో ఆ పార్టీ వర్గాల్లో ఒక్కసారిగా వేడి అందుకుంది. మార్చి మొదటి వారంలోనే రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ రానుండటంతో అత్యంత కీలకమైన రాజ్యసభ స్థానం దక్కించుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. తాజాగా ‘రిలయన్స్ మాధవ్’ టీడీపీ కోటా నుంచి రాజ్యసభ బరిలో నిలవనున్నట్లు ఆ పార్టీ వర్గాల్లో గుప్పుమంటోంది. తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ అమరావతిలో పర్యటించి..ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో ఆధిథ్యం కూడా తీసుకుని వెళ్ళిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆయన కూడా మాధవ్ పేరు సిఫారసు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

*** ఇది ఎవరి అవకాశాలను దెబ్బతీస్తుందా? అన్న టెన్షన్ లో తెదేపా నేతలు ఉన్నారు. ఏపీ కోటా నుంచి మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో రెండు సీట్లు టీడీపీకి పక్కా. అసెంబ్లీ బలాబలాల ప్రకారం చూసుకుంటే ప్రధాన ప్రతిపక్షం వైసీపీకి ఒక సీటు గ్యారంటీ. అయితే అధికార టీడీపీ మూడవ సీటుకు కూడా అభ్యర్థిని బరిలో నింపే ప్రయత్నాల్లో ఉంది. సీట్లు రెండే ఉండటం..ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో చంద్రబాబుకు ఇది కత్తిమీదసాములా మారనుంది. ఈ తరుణంలో రిలయన్స్ మాధవ్ పేరు టీడీపీ నేతల నుంచే ప్రచారంలోకి రావటంతో సీటు ఆశిస్తున్న వారు టెన్షన్ పడుతున్నారు. ***2018 ఏప్రిల్ లో ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న చిరంజీవి, రేణుకా చౌదరి, దేవేందర్ గౌడ్ పదవి విరమణ చేయనున్నారు. సీఎం రమేష్ తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా ఆయన రాజ్యసభ కాలపరిమితి కూడా ఏప్రిల్ లోనే ముగియనుంది. ఆయన తనకు మళ్ళీ రెన్యువల్ చేయించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు కూడా అదే పనిలో ఉన్నారు. ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు రాజ్య సభకు వెళ్లాలని కుతూహలంగా ఉన్నారు. ఇటీవల ఆయన తన మనసులో మాట బహిరంగంగానే వెల్లడించారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్తితుల్లో యనమలను రాజ్య సభకు పంపడానికి చంద్రబాబు అంగీకరించడం లేదు. చంద్రబాబు బావమరిది, మాజీ ఎంపీ హరికృష్ణను మళ్ళి రాజ్యసభకు పంపాలనే పార్టీలో ఉన్న సీనియర్ నాయకులూ సూచిస్తున్నారు. లేనిపక్షంలో వచ్చే ఎన్నికల నాటికి హరికృష్ణ అడ్డం తిరుగుతారేమోనని సందేహం కూడా పార్టీ అధిష్టానంలో ఉంది. కాపు సామాజిక వర్గం నుండి ఒకరిని రాజ్య సభకు పంపే అవకాశం కూడా తెదేపా ఆదిస్థానం పరిశీలిస్తోంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com