తెలంగాణాలో బస్సుల సమ్మె లే

ఈ నెల 11 నుంచి టీఎంయూ నేతృత్వంలో ఆర్టీసీ కార్మిక సంఘాలు తలపెట్టనున్న సమ్మెను నివారించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మంత్రుల బృందం ఈ ఉదయం నుంచి టీఎంయూతో పలు దఫాలుగా మంత్రాంగం జరుపుతోంది. ఈ ఉదయం మంత్రుల బృందం ఆర్టీసీ సమ్మె విషయమై చర్చించింది. అనంతరం టీఎంయూ నేతలతోనూ సమావేశమై వారి అభిప్రాయాలను తీసుకుంది. అనంతరం టీఎంయూ నేతల ప్రతిపాదనలతో ప్రగతిభవన్‌కు వెళ్లిన మంత్రుల బృందం సీఎం కేసీఆర్‌తో సమావేశమైంది. కార్మిక సంఘం నేతల ప్రతిపాదనలను కేసీఆర్‌కు మంత్రులు వివరించారు. వారి డిమాండ్లు, సమ్మె విరమణకు తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. అనంతరం మంత్రుల బృందం మరోసారి విడిగా భేటీ అయింది. మళ్లీ టీఎంయూ నేతలను ప్రగతిభవన్‌కు పిలిపించి వారితో చర్చలు జరుపుతున్నారు. ఆర్థిక మంత్రి ఈటలతో పాటు హరీశ్‌రావు, కేటీఆర్‌, తుమ్మల, మహేందర్‌ రెడ్డి బృందంతో టీఎంయూ నేతల సంప్రదింపులు కొనసాగుతున్నాయి. సమ్మె నివారణకు ప్రయత్నాలు ప్రభుత్వం తీవ్రంగా కృషిచేస్తోంది. సమ్మె విరమించుకుంటే తాము కార్మికులు, ఉద్యోగుల సమస్యలపై పూర్తిస్థాయిలో చర్చిస్తామని అంటున్నారు. అయితే, టీఎంయూ నేతలు మాత్రం కొన్ని ప్రతిపాదనల్ని మంత్రుల ముందు ఉంచారు. కొత్తగా డ్రైవర్‌, కండెక్టర్‌ ఉద్యోగాల నియామకంతో పాటు ఆర్టీసీ బలోపేతానికి కొన్ని చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆర్టీసీ నష్టాలను వన్‌ టైంసెటిల్‌మెట్‌గా భరించాలని, ఆర్టీసీపై ఉన్న మోటార్‌ వాహనాల పన్నును, డీజిల్‌పై ఉన్న పన్నును రద్దు చేయాలని టీఎంయూ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. వీటన్నింటితో పాటు ఫిట్‌మెంట్‌ విషయమై నిర్ణయం తీసుకోవాలని కోరారు. వీరితో చర్చల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది. సమ్మె విరమించుకోవాలంటూ ఇప్పటికే సీఎం కేసీఆర్‌ కార్మిక సంఘాల నేతలకు ఘాటుగా హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com