తెలంగాణా పథకాలు…దేశంలోనే లేవు

అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకుని రవీంద్ర భారతిలో ఎస్సీ వ్యాపార వేత్తలకు అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ‘‘పారిశ్రామికీకరణలో గుజరాత్‌ను ఆదర్శంగా చెబుతుంటారు. మోదీ నినాదం సబ్‌కా సాత్‌.. సబ్‌కా వికాస్‌. కానీ దళితుల అభివృద్ధి కోసం తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు గుజరాత్‌లో కూడా లేవు. దేశంలో ఎక్కడా లేని విధంగా శిక్షణ ఇచ్చి దళిత, గిరిజన గుత్తేదారులను పోత్రహిస్తున్నాం. ఇప్పటికే 80 మందికి శిక్షణ ఇచ్చాం.. వారిలో 40 మంది ప్రభుత్వ కాంట్రాక్టులు, 20 మంది ప్రైవేటు కాంట్రాక్టులు చేస్తున్నారు. ఎస్సీలకు తెలంగాణలో దక్కిన ప్రోత్సాహం దేశంలో మరెక్కడా దక్కటం లేదు. దళితులకు బిజినెస్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేయమని కోరారు.. తప్పకుండా ఏర్పాటు చేస్తాం. సూక్ష్మ, చిన్న పరిశ్రమలు ఎన్‌పీఏ బారిన పడకుండా పరిష్కారం చూపిస్తాం. రూ.50 కోట్ల కార్పస్‌ ఫండ్‌తో మూతపడే స్థితిలో ఉన్న కంపెనీలను ఆదుకుంటున్నాం. ఇప్పటికే 23 పరిశ్రమలకు బాసటగా నిలిచి అవి మూతపడకుండా చూశాం. మ్యానుఫ్యాక్చరింగ్‌ పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహం ఇస్తాం.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com