తెలంగాణ కెనడా సంఘం ఆధ్వర్యంలో ఆవిర్భావ వేడుకలు


తెలంగాణ కెనడా సంఘం (Telangana Canada Association –TCA) ఆద్వ్యర్యంలో తేది జూన్ 9 2018 శనివారం రోజున టొరొంటో మహా నగరంలోని ఎటోబికోక్ మైకేల్ పవర్ సేయింట్ జోసెఫ్ ఉన్నత పాఠశాల ఆడిటోరియంలో తెలంగాణ కెనడా ధూంధాం పేరుతో తెలంగాణ ఆవిర్బావాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సంబురాల్లో దాదాపు 500 పైగా కెనడా తెలంగాణ వాసులు పాల్గొని విజయవంతం చేసారు. మొదటగా కార్యదర్శి రాధిక బెజ్జంకి అందరికి ఆహ్వానం పలికారు అధ్యక్షులు కోటేశ్వరరావు చిత్తలూరి సభ ప్రారంబానికి జెండా ఊపగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలను ప్రారంభించారు. ఫౌండేషన్ కమిటి అధ్యక్షులు దేవేందర్ రెడ్ది గుజ్జుల, ట్తస్టీ అధ్యక్షులు ప్రభాకర్ కంభాలపల్లి అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించి సభకువిచ్చేసిన వారందరితో మౌనం పాటింప చేసిన తర్వాత ఉత్సవాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా కెనడాలో భారత ప్రభుత్వ ఉప రాయబారి దవిందర్ పాల్ సింగ్ మరియు మిస్సిస్సౌగ-మాల్టన్ రైడింగ్ ఓంటారియో ప్రొవిన్సియల్ పార్లమెంట్ సభ్యులు దీపక్ ఆనంద్ విచ్చెసి సభికులనుద్దేసించి ప్రసంగించారు. ఈ వేడుకలు కల్చరల్ సెక్రటరీ విజయకుమార్ తిరుమలాపురం ఆద్వైర్యంలో ఎన్నోవివిద సాంస్కృతిక కార్యక్రమాలతొ దాదాపు 6 గంటలపాటు సభికులను అలరించాయి. ఈ కార్యక్రమాలన్నీ స్థానిక తెలంగాణ వారు చక్కటి తెలంగాణ భాని లో ప్రదర్శించటం విశేషం. ఈ సంబురాలను తెలంగాణ కెనడా అసోసియేషన్ అధ్యక్షులు కోటేశ్వరరావు చిత్తలూరి ఆధ్వర్యంలో జరుగగా, ట్తస్టీ అధ్యక్షులు ప్రభాకర్ కంభాలపల్లి , ఫౌండేషన్ కమిటి అధ్యక్షులు దేవేందర్ రెడ్ది గుజ్జుల, ఉపాధ్యక్షులు రాజేశ్వర్ ఈద, సెక్రటరీ రాధిక బెజ్జంకి , కల్చరల్ సెక్రటరీ విజయకుమార్ తిరుమలాపురం , ట్రెజరర్ సంతోష్ గజవాడ మరియు డైరక్టర్లు నివాస్ మన్నెం, దామోదర్ రెడ్ది మాది, మురళి కాందివనం, భారతి కైరోజు, ట్రుస్టీలు సమ్మయ్య వాసం, నివాస్ తిరునగరి, ఫౌండర్లు రమేశ్ మునుకుంట్ల, చంద్ర స్వర్గం, నాధ్ రెడ్డి కుందూరి, నవీన్ రెడ్ది సూదిరెడ్ది, అఖిలేశ్ బెజ్జంకి, వేణుగోపాల్ రోకండ్ల, ప్రకాశ్ రెడ్డి చిట్యాల, హరి రావుల మరియు ఇతర వాలంటీర్సు సహకారంతో నిర్వహించారు. సభికులందరికి తెలంగాణ కెనడా అసోసియేషన్ రుచికరమైన తెలంగాణ వంటకాలతో భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వ్యాక్యాతలుగా కుమారి సరయు రెడ్డి చిట్యాల మరియు స్పందన కొండ లు వ్యవహరించారు. ఆఖరున వందన సమర్పణతో కార్యక్రమాలు ముగిసాయి.
tags: telangana canada association telangana canada tnilive tni telugu news international canada nris celebrate telangana formation day 2018 photo gallery telugu news canada

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com