తెలంగాణ తిండి అత్యంత అనారోగ్యకరం

వారానికోమారయినా బిర్యానీ, మసాలా ఆహారం తినాలని కోరుకునే వారు..అలా తినేవారు తెలంగాణ రాష్ట్రంలో గణనీయంగా పెరుగుతున్నట్లు ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం అధ్యయనంలో తేలింది. తెలంగాణలో ఏ ప్రాంతంలో ప్రజలు ఏమేం తింటున్నారు, నెలవారీగా ఆహారానికి ఎంత ఖర్చు పెడుతున్నారు, వారి ఆహార అలవాట్లు ఏమిటనే అంశంపై వర్శిటీ అధ్యయనం చేసింది. రాష్ట్రంలో ప్రజల ఆహార అలవాట్ల ఆధారంగా పంటలు సాగు చేయాలన్న వ్యవసాయశాఖ లక్ష్యం.. ఏ ప్రాంతంలో ఏ ఆహారోత్పత్తికి గిరాకీ ఉంటే ఆ ప్రాంతంలో అదే పంటను సాగు చేసేలా ‘పంట కాలనీ’లు ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం మేరకు వర్శిటీ చేసిన సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి.
* రాష్ట్రంలో సుగంధ ద్రవ్యాల వినియోగం చాలా ఎక్కువగా ఉంది. సగటున నెలకు తలసరి 635 గ్రాములు వాడుతున్నారు. మాంసాహారం అధికంగా తినడం వల్లనే మసాలాలు, సుగంధ ద్రవ్యాల వినియోగం ఎక్కువగా ఉంటోంది.
* నెలకు ఒక్కో వ్యక్తి సగటున 1.38 కిలోల మాంసం తింటుండగా.. జయశంకర్‌ భూపాల్‌పల్లి జిల్లాలో ఈ వినియోగం 2 కిలోల వరకు, అతి తక్కువగా వికారాబాద్‌లో కిలోగా ఉంది.
* మాంసాహారంలో కోడి మాంసం వాటా 40 శాతం వరకూ ఉంటోంది. సగటున 550 గ్రాముల కోడిమాంసం తింటున్నారు. జయశంకర్‌ జిల్లాలో 890 గ్రాములు లాగించేస్తున్నారు.
* సగటున నెలకు తలసరి 1.22 లీటర్ల నూనె వాడుతుండగా..అందులో పొద్దుతిరుగుడు నూనె వాటా అధికం. ఆదిలాబాద్‌లో అత్యధికంగా 1.11 లీటర్లు, యాదాద్రిలో అతి తక్కువగా 0.75 లీటర్ల వంటనూనెతో కూరలు వండుతున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com