ఉచిత విద్యుత్ ప్రయోగం విజయవంతం.

రాష్ట్రంలో రైతులందరికీ ప్రయోగాత్మకంగా అందించిన 24 గంటల విద్యుత్‌ సరఫరా విజయవంతమైంది. నవంబర్‌ 6న అర్థరాత్రి నుంచి రాష్ట్రంలోని 23 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు 24 గంటల విద్యుత్‌ను అందించారు. ఐదారు రోజుల పాటు సరఫరా చేసి పరిస్థితి అంచనా వేయాలని మొదట విద్యుత్‌ శాఖ అధికారులు భావించారు. అయితే ట్రాన్స్‌ఫార్మర్ల నుంచి 400కెవి సబ్‌స్టేషన్‌ వరకు పడే భారాన్ని, ఒత్తిడిని మరింత లోతుగా అధ్యయనం చేయడం కోసం 20వ తేదీ వరకు ప్రయోగాత్మకంగా సరఫరా చేయనున్నట్లు జెన్‌కో, ట్రాన్స్‌కో ఎంపీ ప్రభాకర్‌రావు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలిపారు. దీనికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వచ్చే జనవరి 1 నుంచి రాష్ట్రంలోని రైతులందరికీ 24 గంటల విద్యుత్‌ చేయనున్నట్లు ఆయన తెలిపారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com