తెలుగు ఆవేదన దీక్షలో యార్లగడ్డ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు భాష పట్ల వ్యవహరిస్తున్న తీరుపై సాహితీవేత్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తీవ్రంగా మండిపడ్డారు. తిరుపతి సబ్కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం యార్లగడ్డ ఆధ్వర్యంలో తెలుగు ఆవేదన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా తెలుగు భాషకు ప్రభుత్వం ద్రోహం చేస్తుందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోలేదని ఆయన విమర్శించారు. అమరావతిలో శిలాఫలకాలపై ఇంగ్లీష్ అక్షరాలు ఉండటం సిగ్గుచేటని అన్నారు. అక్టోబర్ 2 నాటికి శిలాఫలకాలను మార్చాలని, లేకపోతే ఉద్యమం తప్పదని యార్లగడ్డ హెచ్చరించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com