తెలుగు తమ్ముళ్లకు చేదువార్త. కర్ణాటక పీఠం భాజపాదే. గవర్నర్ సంచలన నిర్ణయం.

అనేక ఉత్కంఠ పరిణామాల మధ్య కర్ణాటక రాష్ట్ర పగ్గాలు భాజపా దక్కించుకుంది. నిన్న వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సాధారణ మెజార్టీకి దగ్గరగా వచ్చి ఏకైక పెద్ద పార్టీగా అవతరించిన భాజపాను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్‌ ఆహ్వానించారు. దీంతో ఆ పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన యడ్యూరప్ప కర్ణాటక సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ మేరకు గురువారం ఉదయం 9 గంటలకు యడ్యూరప్ప ప్రమాణస్వీకారోత్సవానికి రాజ్‌భవన్‌లో రంగం సిద్ధమవుతోంది. మంత్రివర్గ విస్తరణ ఆతర్వాత జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. బల నిరూపణ కోసం యడ్యూరప్పకు గవర్నర్‌ 15 రోజుల గడువు ఇచ్చారు. నిన్న వెలువడిన ఫలితాల్లో ఏ పార్టీకీ సాధారణ మెజార్టీ రాలేదు. దీంతో 78 స్థానాలు గెలిచిన కాంగ్రెస్‌ 38 స్థానాలు గెలిచిన జేడీఎస్‌కు మద్దతు ప్రకటించింది. సీఎంగా జేడీఎస్‌ అధినేత కుమారస్వామిని ఎన్నుకొనేందుకు కాంగ్రెస్‌ సంసిద్ధత ప్రకటించిన నేపథ్యంలో కన్నడ రాజకీయం రసవత్తరంగా మారింది. ఈ నేపథ్యంలో రాజకీయం కర్ణాటక రాజ్‌భవన్‌కు చేరడంతో గవర్నర్‌ నిర్ణయం కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా యడ్యూరప్ప, కుమారస్వామి ఇద్దరూ గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాలని కోరగా.. తాజాగా గవర్నర్‌ 104 స్థానాలు గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించిన భాజపాకు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్‌ నిర్ణయంపై కాంగ్రెస్‌ పార్టీ భగ్గుమంది. కాంగ్రెస్‌, జేడీఎస్‌కు పూర్తి మెజార్టీ ఉందని కేంద్రమాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం అన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కుమారస్వామిని గవర్నర్‌ ఆహ్వానించలేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. యడ్యూరప్పను ఆహ్వానించినట్టు తమకు తెలిసిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా గవర్నర్‌ నిర్ణయం తీసుకోవాలని చిదంబరం అన్నారు. రాజ్యాంగ బద్ధంగా కుమారస్వామిని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఆహ్వానించాలని కాంగ్రెస్‌ నేత కపిల్‌ సిబల్‌ అన్నారు. రాజ్‌భవన్‌లో ఏం జరుగుతోందో తమకు అర్థం కావట్లేదన్నారు. రాజ్యాంగానికి అనుగుణంగా వ్యవహరించాల్సిన బాధ్యత గవర్నర్‌పై ఉందన్నారు.

null

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com