తెలుగు మహిళలకు ఆదర్శం-జస్టిస్ కొంగర విజయలక్ష్మి

సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన న్యాయవాదిగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా, హైకోర్టు న్యాయమూర్తిగా అంచలంచెలుగా ఎదిగిన మహిళా న్యాయమూర్తులు చాలా తక్కువ మండే ఉన్నారు. న్యాయదేవత ముద్దుబిడ్డ, న్యాయానికి నిలువెత్తు రూపం, నిజామాబాదు జిల్లా నుండి ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు మొట్టమొదటి మహిళా న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ కొంగర విజయలక్ష్మిని స్వ గ్రామస్థులు ఘనంగా సన్మానం చేశారు.
*నిజామాబాదు మండలం మాధవనగరం గ్రామానికి చెందినా కొంగర విజయలక్ష్మిని హైకోర్టు జడ్జిగా నియమితులైన సందర్భంగా ఆమెను స్థానిక కమ్మ సంఘం భవనంలో మాధవర నగరం గ్రామాభివృద్ది కమిటీ, గ్రామస్తులు ఘనంగా జనవరి 8న సన్మానించారు.
*ఆ గ్రామా పొలిమేరలో గ్రామస్తులు జస్టిస్ట్ కు మంగళ వాయిద్యాలతో ఎదురేగి స్వాగతం పలికి స్థానిక సాయిబాబా దేవాలయానికి తీసుకువెళ్ళగా జస్టిస్ విజయలక్ష్మి దంపతులు విశేష పూజలు నిర్వహించారు. దేవస్థానం పూజారి ఆ దంపతులకు సాయినాధుని శేష వస్త్రాలు , తీర్ధ ప్రసాదాలు సమర్పించారు. గ్రామస్తులు వారిని మేళతాళాలతో కాలినడకన సాభావేదిక వద్దకు తీసుకు వచ్చారు.
*జస్టిస్ విజయలక్ష్మి కృష్ణాజిల్లా గొడవర్రు గ్రామానికి చెందినా గుళ్ళపల్లి వెంకటేశ్వరరావు, సీతారత్నం దమప్తులకు 1960లో జన్మించారు. వీర్ ఇవిద్యాభ్యాసం సికింద్రాబాద్ లో సెయింట్ ప్రాన్సిస్ కాలేజీలో ఇంటరు, ఉస్మానియా, విద్యాలయంలో బీకాం, ఆంధ్రా విశ్వవిద్యాలయంలో బీ.ఎల్.ఎం చేశారు.వీరు న్యాయ విద్యలో చురుగ్గా ఉంది గోల్డ్ మెడల్ , అనేక మెరిట్ సర్టిఫికేట్లు, బహుమతులు సంపాదించారు. వీరు 1985లో న్యాయవాద వృత్తిలో ప్రవేశించారు.
**వీరు 1986 మైనింగ్ ఇంజనీరు కొంగర పార్ధసారధి (నిజామాబాద్ జిల్లా) వివాహం చేసుకున్నారు. ఈ సమప్తులకు ఇద్దరు కుమారులు మొదటి కుమారుడు రతన్, వీరి భార్య ఉమాశ్రీ (మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు కుమార్తె. మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పిన్నమనేని కోటేశ్వరరావు మనవరాలు), రెండవ కుమారుడు తేజోరత్న వీరికి ఇంకా వివాహం కాలేదు. అన్నదమ్ములు ఇద్దరు అమెరికాలో బర్డ్స్ యూనివర్సిటి డిగ్రీ చేసి అక్కడే సాఫ్ట్ వేర్ రంగంలో స్థిరపడ్డారు.
**జస్తిస్ విజయలక్ష్మి హైదరాబాద్లోని సివిల్ మరియు క్రిమినల్ కోర్టులలో న్యాయవాదిగా పనిచేశారు. వీరు 1985-90 సంవత్సరాలలో జస్టిస్ పర్వతాలరావు వద్ద జూనియర్ న్యాయవాదిగా ప్రాక్టిస్ ప్రారంభించి 1990-91లో స్వతంత్ర న్యాయవాదిగా 1991-95 లో అసిస్టెంట్ గవర్నమెంటు ప్లీదరుగా 1995-96లో న్యాయవాదిగా స్వతంత్రంగా హైకోర్టులో ప్రాక్టీసు చేసారు. వీరు 1996-97లో జస్టిస్ జాస్తి చలమేశ్వర్ వద్ద 1997-98 గవర్నమెంటు ప్లీడరు అడ్వకేట్ జనరల్ స్వర్గీయ వెంకట్రామయ్య కార్యాలయంలో 1998-2004లో ప్రకాష్ రెడ్డి వద్ద గవర్నమెంటు ప్లీదరుగా పనిచేసారు. ముకరంజాహి న్యాయ కళాశాలలో పార్ట్ టైం లెక్చరరుగా పనిచేసారు. 2004 నుండి హైక్రోటు న్యాయవాదిగా పనిచేస్తుండగా వీరి సామర్ధ్యాన్ని గుర్తించన ప్రభుత్వం 2017 అక్టోబరు నెలలో వీరిని హైకోర్టు జడ్జిగా నియమించింది.
**సభా నిర్వాహకులు పరుచూరి కుటుంబరావు జస్టిస్ విజయలక్ష్మి దంపతులకు అద్యక్షులు డా. సాంబశివరావు, అడుసుమిల్లి మాధవరావు తెలంగాణా కమ్మ సేవాసమితి ప్రధాన కార్యదర్శి గోపాలం విద్యాసాగర్ నిజామాబాద్ జిల్లా కమ్మ సంఘం అద్యక్షులు కలగర శ్రీనివాసరావు, నిజామాబాద్ జిల్లా న్యాయవాది దుర్గాప్రసాద్ గ్రామ సర్పంచి నిమ్మగడ్డ కామేశ్వరీలను వేదిక పైకి ఆహ్వానించారు. గుంటుపల్లి నాగేశ్వరరావు ప్రార్ధనాగీతంతో సభ మొదలైంది. కుటుంబరావు తన ప్రసంగంలో మాధవ నగరం గ్రామానికే చెందినమహిళా న్యాయవాది హైకోర్టు జడ్జిగా నియమించటం తమ గ్రామానికే గర్వకారణం అని గ్రామం తరపున జడిని సన్మానించటం చాలా సంతోషంగా ఉన్న్డదని వచ్చే నెలలో ఆ గ్రామానికి చెందిన ఉద్యోగులను సన్మానించాలని నిర్ణయించామని తెలియజేశారు. ఈ కార్యక్రమ రాదహ్సారధి మాధవరావు తన ప్రసంగంలో తమ ఆహ్వానాన్ని మన్నించి సన్మాన సభకు హైదరాబాద్ నుంచి విచ్చేసిన జస్తిస్ విజయలక్ష్మి దంపతులకు సభకు వచ్చిన అందరికి స్వాగతం తెలియజీస్తూ తమ గ్రామానికి ఈరోజు సిడునం అని ఆనాటి సమావేశ విశేషాలను మాధవ నగరం గ్రామ ఔన్నత్యాన్ని గురించి వివరిస్తూ జస్తిస్ట్ విజయలక్ష్మి ఇంకా ఎన్నో ఉన్నత పదవులు స్వీకరించాలని అభిలాషించారు. కలగర శ్రీనివాసరావు తన ప్రసంగంలో జస్తిస్ట్ విజయలక్ష్మి కర్తవ్య పరాయణత్వాన్ని గుణగునాలని ప్రశంశిస్తూ ఆమె హైకోర్టు జడ్జిగా నియమితు లైనందున చాలా సంతోషంగా ఉన్నాడని అభినందనలు తెలియజేశారు. విద్యాసాగర్ తన ప్రసంగంలో జస్తిస్ట్ విజయలక్ష్మి ఆంధ్రా- తెలంగాణా రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు జడ్జిగా నియమింప బడటం కమ్మ కులానికే గర్వకారణం అని వారు ఇంకా ఎన్నో సోపానాలు అధిరోహించాలని అభిప్రాయపడ్డారు. దుర్గాప్రసాద్ తన ప్రసంగంలో హైకోర్టు జడ్జి ఎన్నో సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుందని జస్తిస్ట్ విజయలక్ష్మి ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొని పరిష్కరిచగల సమర్ధులని, వారు హైకోర్టు చీప్ జస్టిస్ట్ పదవీ కూడా అలమకరించారని అభిప్రాయపడ్డారు. కొసరాజు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మాధవనగరం గ్రామంలో రోడ్లు సౌకర్యంగా లేని రోజుల్లో తమ తరం వారంతా కష్టపడి చదివి పైకి వచ్చామని తమ గ్రామస్తురాలు హైకోర్టు జడ్జిగా నియమితులు కావడం గ్రామానికే కాక నిజామాబాద్ జిల్లాకే గర్వకారణమని జస్టిస్ట్ విజయలక్ష్మి సుప్రీంకోర్టు జడ్జిగా కూడా భవిష్యత్తులో నియమితులవ్వాలని అభిప్రాయ పడ్డారు. క్సోఅరాజు బోసుబాబు తన ప్రసంగంలో మాధవనగరం గ్రామానికే చెందినా మహిళా న్యాయవాది హైకోర్టు జడ్జిగా నియమితులవ్వడం చాలా సంతోషంగా ఉన్నాడని వారు ఇంకా ఎన్నో ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్ష అని చెప్పారు. మండవ రామకృష్ణ విశ్రాంత ఆర్టీసీ ఉద్యోగి మాట్లాడుతూ జస్తిస్ట్ విజయలక్ష్మి ఆ పదవికే వన్నె తెస్తారని అన్నారు. కొంగర సుబ్బారావు మాట్లాడుతూ మాధవనగరంలో పెరిగి పెద్దవారైన తాము తన కుమార్తె రెసిడెన్సియల్ కాలేజీ ప్రిన్సిపాల్ గా తన అల్లుడు ఇంజనీరుగా తన తమ్ముని భార్య హైకోర్టు జడ్జిగా నియమితులు అవ్వడం తమకెంతో సంతోషదాయకమని గర్వంగా ఉన్నదని అన్నారు. దాసరి సత్యవతి మాట్లాడుతూ హైకోర్టు జడ్జిగా నియమితులు కావడం తమ మహిళలందరుకూ గర్వకారణంగా ఉన్నాడని అన్నారు.
**జస్టిస్ట్ విజయలక్ష్మి దంపతులకు ప్రత్యెక ఆసనాల పై కూర్చోబెట్టి మాధవరావు సన్యాసపత్రాన్ని కాహ్దవగా అదే గ్రామానికి చెందిన శతవసంతాల పూర్తీ చ్సుకున్న వేములపల్లి చంద్రమ్మ, గ్రామ ఉప సర్పంచ్ నిమ్మగడ్డ కామేశ్వరి , గ్రామ మహిళలు దాసరి సత్యవతి, వీరమాచినేని హిమబిందు హస్తాలతో విజయలక్ష్మిని ఘన్మగా సన్మానించారు. వారిని దుశ్శాలువా, జ్ఞాపిక , సన్మాన పత్రం , పూలమాలతో సన్మానించారు.
**నిజామాబాద్ జిల్లా కోర్టు జడ్జి , నిజామబాద్ జిల్లా బార్ అసోసియేషన్ వారు, గ్రామస్తులు జస్తిస్ట్ విజయలక్ష్మిని సన్మానించారు. గుంటుపల్లి నాగేశ్వరరావు, సినీ గీతాలు పాడి శ్రోతాలను రంజింపజేశారు. సభకు అద్యక్షత వహించిన డా. యార్లగడ్డ సాంబశివరావు తమ అద్యక్షోపన్యాసంలో విజయలక్ష్మిని సన్మాన సమారంభాన్ని నిర్వహించిన మాధవరావు, కుటుంబరావు, ఘంటా సాంబయ్య , దాసరి నాగేశ్వరరావు అభినందిస్తూ తన వయసువాడు స్నేహితుడు అయిన పార్ధసారధి సతీమణి హైకోర్టు జడ్జ్ ఇకావటం తనకు చాలా సంతోషంగా ఉన్నాడని జస్తిస్ట్ విజయలక్ష్మికు శుభాకాంక్షలు తెలియజేశారు. విజయలక్ష్మి తనకు జరిగిన సన్మానానికి ప్రతిస్పందన తెలియజేస్తూ ఉద్యోగరీత్య హైదరాబాద్ లో స్థిరపడ్డ తనను మాధవ నగరం గ్రామానికి ఆహ్వానించి ఘనంగా సంమానించటం తన మెట్టినింటి ఆప్యాయతను మరచి పోలేనని ఈ గ్రామస్తులు తన కుటుంబానికి చూపుతున్న ఆదరణ వేలకట్టలేదని అన్నారు. తన అత్తమామలతో తన అనుబందాన్ని నెమరు వేసుకుంటూ ఈ వూరి వారు ఎంతో అభిమానంతో తనకు సన్మానం చేసినందుకు అందరికి కృతజ్ఞతలు తెలియజేశారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com