తెలుగు రాష్ట్రాల వడ్రంగులకు ఇక పీడకలలే!

స్వీడన్‌ ఫర్నీచర్‌ దిగ్గజం ఐకియా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన తన భారీ స్టోర్‌ను వచ్చే నెల 10వ తేదీన ప్రారంభించే అవకాశం ఉందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌ తెలిపారు. ఈ స్టోర్‌ను కంపెనీ సిఇఒ ప్రారంభించే ఆస్కారం ఉందని చెప్పారు. ఈ స్టోర్‌ కోసం సంస్థ 800 కోట్ల రూపాయలు కేటాయించింది. ఐకియా దేశంలోనే తొలి స్టోర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిందని, దీని వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా చాలా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని జయేష్‌ రంజన్‌ చెప్పారు. కాగా కంపెనీ ఉన్నతాధికారి వచ్చే నెలలో స్టోర్‌ను ప్రారంభిస్తామని తెలిపారు కానీ తేదీని మాత్రం వెల్లడించలేదు. త్వరలోనే తేదీని ప్రకటిస్తామన్నారు.ఈ స్టోర్‌ కోసం 13 ఎకరాల స్థలం తీసుకున్నారు. 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో స్టోర్‌ను అభివృద్ధి చేశారు. ఇప్పటికే స్టోర్‌ కోసం 400 మందిని నియమించుకున్నామని, వీరిలో 50 శాతం మంది మహిళలేనని ఐకియా ఉన్నతాధికారి తెలిపారు. స్టోర్‌లో 7,500 ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయన్నారు. హైదరాబాద్‌ స్టోర్‌ తర్వాత ముంబై, బెంగళూరు, ఢిల్లీ ఎన్‌సిఆర్‌లలోని స్టోర్లను ఐకియా ప్రారంభించాలన్న ప్రణాళికలతో ఉంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com