తేనే నువ్వులు కలిపి తీసుకుంటే…

తేనెను రోజూ తీసుకోవడంవల్ల శరీరానికి శక్తి అందుతుంది. అంతేకాదు, తేనె మనకు ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలను అందిస్తుంది. అలాగే, నువ్వులు. వీటి నుంచి తీసిన నూనెను చాలామంది వంటల్లో వాడతారు. కొందరు నువ్వులతో పిండి వంటలూ చేస్తారు. అలా వంటల్లో వాడటం ద్వారా పలు అనారోగ్యాలను దూరం చేయవచ్చు. అయితే, నిత్యం ఉదయాన్నే పరగడుపున టేబుల్‌ స్పూన్‌ తేనెలో టేబుల్‌ స్పూన్‌ నువ్వులు కలిపి తింటే దాంతో అనేక లాభాలు కలుగుతాయి. తేనె, నువ్వులు రెండింటిలోనూ ప్రోటీన్లు, క్యాల్షియం సమృద్ధిగా ఉంటాయి. దీంతో ఇవి శరీర నిర్మాణానికి ఉపయోగ పడతాయి. ప్రోటీన్ల వల్ల కణజాలం పెరుగుతుంది. క్యాల్షియం వల్ల ఎముకలు దృఢంగా మారతాయి. ఎదిగే పిల్లలకు తేనె, నువ్వులను రోజూ పెడితే చాలా మంచిది. పోషణ సరిగ్గా అందుతుంది. తేనె, నువ్వులు రెండింటిలోనూ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీంతో ఇవి శరీర రోగ నిరోధకశక్తిని పెంచుతాయి. ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. వ్యాధులు రాకుండా చూస్తాయి. ముఖ్యంగా ఈ కాలంలో వచ్చే సీజనల్‌ వ్యాధులురావు. ఊబకాయం ఉన్నవారిలో కొవ్వు తొందరగా కరిగిపోతుంది. పొట్ట వద్ద ఉన్న కొవ్వు వేగంగా కరుగుతుంది. తద్వార బరువు తగ్గుతారు. ఆకలిని తగ్గించడం వల్ల తిండి అదుపులో ఉంటుంది. ఫలితంగా బరువు తగ్గవచ్చు. చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. శిరోజాలు దృఢంగా, ఒత్తుగా పెరుగుతాయి. చుండ్రు సమస్య పోతుంది. మెదడుకు రక్త సరఫరా మెరుగు పడుతుంది. దీంతో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మెదడు యాక్టివ్‌గా మారుతుంది. ఇన్‌స్టంట్‌ ఎనర్జీ అందుతుంది. ఉదయాన్నే శక్తి అందడం వల్ల శరీరం యాక్టివ్‌గా ఉంటుంది. రోజంతా ఉల్లాసంగా ఉంటుంది. ఎంత పనిచేసినా అంత త్వరగా అలసట తెలీదు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com