తొక్కే కదా అని తీసి పారేయకండి

ఈ సీజన్‌లో నారింజలు ఎక్కువగా వస్తాయి. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అయితే పండు తిని తొక్క పడేస్తాం. కానీ ఆ తొక్కలో కూడా ఎన్నో లాభాలున్నాయి.
* ఒక్కోసారి ఫ్రిజ్ నుంచి దుర్వాసన వస్తుంటుంది. అలాంటప్పుడు ఒక గిన్నెలో ఎండబెట్టిన నారింజ తొక్కల పొడి, ఉప్పు వేసి బాగా కలిపి ఆ గిన్నెని ఫ్రిజ్‌లో ఉంచాలి. ఒక రోజులో ఫ్రిజ్‌లోని దుర్వాసనల్ని, తేమనూ ఆ పొడి పీల్చుకుంటుంది.
* నిమ్మజాతి ఫలాల్లో లెమొనేన్ అనే రసాయన పదార్థం ఉంటుంది. ఇది దోమల్ని, ఈగల్ని దూరం చేస్తుంది. ముఖ్యంగా ఈ రసాయన పదార్థం నారింజ పండులో 90 శాతం మేరకు ఉంటుంది. అందువల్ల ఈ తొక్కలు ఉన్న చోట దోమలు, ఈగల బెడద ఉండదు.
* ఒక డబ్బాలో నారింజ తొక్కలు వేసి ఉంచండి. దానికి రంధ్రాలున్న మూత పెట్టి బట్టలు పెట్టిన అల్మారాలో ఉంచండి. బట్టలు మంచి వాసన వస్తుంటాయి.
* స్వీట్ల తయారీలో ఉపయోగించే బ్రౌన్ షుగర్ గడ్డ కట్టకుండా కూడా ఈ తొక్కలు ఉపయోగపడుతాయి.
* ఒక సీసాలో రెండు నారింజ తొక్కలని వేసి అవి మునిగేంత వరకు వెనిగర్ వేయాలి. ఆ సీసాను ఓ వారంపాటు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత తొక్కలని తీసేసి వెనిగర్‌ని స్ప్రే సీసాలో పోసుకొని చెక్క ఫర్నీచర్, ఫ్రిజ్, ఓవెన్, స్టెయిన్‌లెస్ స్టీలు వస్తువులను తుడిస్తే కొత్తవాటిలా మెరుస్తాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com