తొలిసారి ‘అటా-టాటా’ సంయుక్త సమావేశం.

అమెరికాలోని కీలక సంఘాలైన అమెరికా తెలుగు సంఘం( అటా), తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్‌(టాటా) తొలిసారి సంయుక్తంగా భారీ సభను నిర్వహించబోతున్నాయి. మే 31న డల్లాస్‌లో, జూన్‌ 2న టెక్సాస్‌లో ఈ సభలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సభానిర్వహణ కోసం నిధుల సేకరణ నిమిత్తం టెక్సాస్‌లో డిన్నర్‌ ఏర్పాటు చేశారు. దీనికి అమెరికాలో నివసిస్తున్న పలువురు తెలుగువారు తరలివచ్చారు.ఈ కార్యక్రమం ద్వారా దాదాపు అర మిలియన్‌ నిధులు సమకూరాయి. ఈ సందర్భంగా ఈ రెండు సంఘాల వ్యవస్థాపక సభ్యులైన పైళ్లా మల్లా రెడ్డి, హనుమంతరెడ్డి మాట్లాడుతూ రెండు సంఘాల మధ్య మంచి స్నేహం భావం పెంపొందాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. తాము చేపట్టాలనుకున్న సభకు భారీ స్థాయిలో మద్దతు లభించిందని చెప్పారు.ఈ సభ ద్వారా మన సంస్కృతిని తెలియజేయడంతో పాటు సకుటుంబ సమేతంగా, స్నేహితులతో హాజరుకావడం ద్వారా కుటుంబ విలువలను చాటి చెప్పాలనుకుంటున్నమన్నారు. ఆహూతులను అలరించేలా వివిధ వినోద కార్యక్రమాను సైతం ఏర్పాటు చేయనున్నారు. శాస్త్రీయ నృత్యాలు, కవిత్వం వంటి వాటిని ఈ వేదిక ద్వారా ప్రదర్శించనున్నట్లు వారు చెప్పారు.సభ ఏర్పాట్లను అటా అధ్యక్షుడు కరుణాకర్‌ అసిరెడ్డి, టాటా అధ్యక్షుడు హరినాథ్‌ పొలిచెర్ల ఆధ్వర్యంలోని జాయింట్ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ, అజయ్‌ రెడ్డి, అరవింద్‌ ముప్పిడి,భరత్‌ మదడి, ధీరజ్ ఆకుల, జ్యోతి రెడ్డి, కిరణ్‌ రెడ్డి పాశం, మోహన్‌ పటోళ్ల, రఘువీర్‌ బండారు, మహేశ్‌ ఆదిభట్ల, సతీశ్‌ రెడ్డి, శ్రీనివాస్‌ అనుగు, విక్రమ్‌ జనగామ్‌ తదితరులు పర్యవేక్షించనున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com